పరిశ్రమలకు భూముల కేటాయింపుల్లో జాగ్రత్తలు వహించండి

-ఎస్ఐపీసీ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
Date:13/02/2018
అమరావతి ముచ్చట్లు:
పరిశ్రమలకు భూములు కేటాయించే సందర్భంలో నిబంధనలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. సచివాలయం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ(ఎస్ఐపీసీ) పనితీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమికి తగిన భద్రతకల్పించేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలకు భూములు ఇచ్చే విధానం, పరిశ్రమలకు ఇచ్చిన భూములు, ఉపాధి కల్పన, విద్యుత్,నీటి సరఫరా, శిక్షణ, ఎస్జీఎస్టీ తదితర  రాయితీలకు సంబంధించిన అంశాలు చర్చించారు. వివిధ సంస్థలకు  ఇచ్చిన భూములు, ఆ సంస్థలు పెట్టే పెట్టుబడులు, ఎంతమందికి ఉపాధి కల్పించేది తదితర అంశాలను అధికారులు సీఎస్ కు వివరించారు. ఎంఓయులోనే నిబంధనలు అన్నీ పొందుపరుస్తున్నట్లు చెప్పారు. కియోమోటార్స్ కార్పోరేషన్, అరవింద్ లిమిటెడ్ వంటి సంస్థలకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా పారిశ్రామిక విధానం, ఉద్యోగ కల్పన సబ్సిడీపై లోతుగా చర్చించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు, ఏపీ ట్రాన్స్ కో ఎండీ కె.విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండి, ఆర్టీజీ సీఈఓ బాబు.ఏ, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్ధ జైన్  తదితరులు పాల్గొన్నారు.
Tags: Take care of allocated land for industries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *