తలాక్‌ అన్నారో…! మూడేళ్లు జైలు

హైదరాబాద్‌ ముచ్చట్లు :

ఎప్పటికప్పుడు తలాక్‌ అని మూడుసార్లు చెప్పి తన వైవాహిక జీవితాన్ని రద్దు చేసుకునే భర్తలకు ఇక మూడేళ్లు జైలుకెళ్లాల్సిందేనంటు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం మతాచారం మేరకు తలాక్‌ చెప్పి, వివాహాన్ని రద్దు చేసుకునే సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు స్వస్తి పలికింది. ముస్లిం మహిళల మనోభావాలు , కుటుంబ గౌరవాలు దెబ్బతినకుండ తలాక్‌ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఎంతో మంది యువకులు వివాహం జరిగిన కొద్దిరోజులకే మూడుసార్లు తలాక్‌ చెప్పి, మహిళలను కించపరుస్తున్నారని పలు కుటుంభాలు ఆవేదన చెందాయి. ఇలాంటి వాటి వలన మహిళల హక్కులకు భంగం కలగకూడదన్న ఆలోచనతో నూతన చట్టం తెరపైకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విడాకులు తీసుకోవాలకునేవారు ఇక మీదట న్యాయస్థానాల ఉత్తర్వుల మేరకు విడాకులు పొందాల్సి ఉంది. ఉల్లంఘిస్తే మూడేళ్లు జైలుకెళ్లాల్సిందేనని చట్టం నిర్ధేశిస్తోంది. దీని ద్వారా ముస్లిం మహిళలకు, వారి సంతానానికి రక్షణ కలగనున్నది. ఈచట్టాన్ని ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ చట్టం ద్వారా మహిళలు ఎంతో ప్రయోజనం చేకూరనున్నది. ఈ చట్టాన్ని ముస్లింలు స్వాగతిస్తున్నారు.

Tag : Talaq Annor …! Three years jail


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *