తెలంగాణలో తమిళ తంబీల స్టైల్

Date:21/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ‌లో కూడా తమిళ…సంప్ర‌దాయం.. అదేనండీ వ్య‌క్తిపూజ వైపు మ‌ళ్లుతున్నారా! అనే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.  కేసీఆర్‌.. కేసీఆర్‌.. 2014 త‌రువాత‌.. తెలంగాణ మొత్తం ఊపేస్తున్న పేరు.  సీఎం పీఠం ఎక్కి.. అర్రె భ‌య్ మ‌న‌కేం త‌క్కువ‌రా భ‌య్‌.. అంటూ బ‌ర్రెలిస్తూ.. గొర్రెలిస్తూ.. మ‌స్త్ ఖుషీ అవుతున్నారు. కాంగ్రెస్ ఉన్నా.. టీడీపీ సై అన్నా.. కారు ద‌రిదాపుల్లోకి కూడా చేరే ప‌రిస్థితిలో లేదు. ఎంత స‌ర్కారుపై వ్య‌తిరేక‌త వున్నా.. జ‌నం గులాబీ గుర్తుకే ఓట్లు వేయాల్సిందే అనేంత‌గా.. ప్ర‌చారం ఊద‌ర‌గొడుతున్నారు. అందుకే.. ప‌క్కోళ్ల‌ని.. పావ‌లా నేత‌ల్ని న‌మ్ముకునేకంటే.. కేసీఆర్‌, కేటీఆర్‌, వీలైతే. క‌విత‌క్క‌ను పూజిస్తేచాలు.. రేప‌టి సీటు గ్యారంటీ.. అదీ గాక‌పోతే.. ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వైనా రాక‌పోద్దా! అనే ఆలోచ‌న తెలంగాణ వ్యాప్తంగా బాగా పెరిగింది. చోటా నేత‌ల నుంచి బ‌డా నాయ‌కుల వ‌ర‌కూ.. కేసీఆర్ తెలంగాణ గాంధీగా వ‌ర్ణిస్తూ.. కొత్తా దేవుడండీ అన్న‌ట్లుగా పొర్లు దండాలు
పెట్టేస్తున్నారు. క‌విత‌క్క‌కు మున్ముందు గుడి క‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌క్కర్లేదు. అర‌వ సోద‌రుల‌తో మిగిలిన విష‌యాల్లో పోటీప‌డ‌క‌పోయినా.. ఈ విధంగా అయినా త‌మిళ బ్ర‌ద‌ర్స్ భ‌క్తిని ఆచ‌ర‌ణ‌లో పెడుతున్నార‌న్న‌మాట‌.
Tags: Tamil lemila style in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *