టార్గెట్ 2019

Date:21/06/2018
నల్గొండ ముచ్చట్లు:
2019 సాధారణ ఎన్నికల టార్గెట్ గా టిఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే… మరోవైపు పార్టీని బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం నియోజకవర్గాలకే పరిమితం అవుతు న్నారు. గత రెండు, మూడు నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు  అందరూ కూడా  నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు… ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు స్కీమును కూడా విజయవంతం చేశారు గులాబీ నేతలు. గతంలో హైదరాబాద్లో ఉండి జిల్లా, నియోజకవర్గ కార్యక్రమాలను, పనులను పర్యవేక్షించిన నేత లంతా ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్… సూచనల మేరకు నేతలంతా జిల్లా, నియోజకవర్గాలకు పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించేందుకు వ్యూహాల రచనలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం  ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన కార్యకర్తల్లో కొంత అసంతృప్తులు ఉంటాయని… అలాంటి వారిని గుర్తించి బుజ్జగించి పార్టీని ముందుకు నడిపించా లని కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు గులాబీ దళపతి కేసిఆర్. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన రైతు సమన్వయ సమితిలోని పార్టీ క్యాడర్ ను కూడా పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించాలని ఆదేశించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివి కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే లు లేదా ఇన్చార్జిలు లబ్ధిదారులకు  అందించేలా చూడాలన్నారు కెసిఆర్. ఒకవైపు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా చూస్తూనే … పార్టీ క్యాడర్ మధ్య నేతల మధ్య సమన్వయం ఉండేలాగా చూడాల్సిన బాధ్యత కూడా మంత్రులు, ఎమ్మెల్యేల ఉందని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.  మొత్తంగా 2019 టార్గెట్గా పార్టీని గెలిపించేందుకు గులాబీ దళపతి తన శక్తియుక్తులన్నిటినీ ఒడ్డుతున్నారు. అయితే ఏ మేరకు విజయం సాధిస్తారు అనేది వేచి చూడాల్సిందే.
Tags: Target 2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *