TDP, BJP divorce !!

టీడీపీ,బీజేపీ డైవోర్స్ !!

Date : 30/12/2017

అమరావతి ముచ్చట్లు :

ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ, మిత్రపక్షమైన బిజేపిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా.? చంద్రబాబు ప్రభుత్వంపై బిజేపి నేతల ఆరోపణలు, పోలవరం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా.? గుజరాత్ లో బిజేపి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి అందుకే బాబు డుమ్మా కొట్టారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపిలో ప్రస్తుతం మిత్రపక్షాల మధ్య పాలిటిక్స్ హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. దీంతో 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు జత కడతాయా అనే పశ్న తలెత్తుతోంది.ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షాలైన టీడీపీ, బిజేపిలు కలిసి ప్రభుత్వ భాగస్వాములుగా కొనసాగుతున్నారు. అటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా టిడిపి ఎంపిలు కూడా కేంద్ర మంత్రుల హోదాలో కొనసాగుతున్నారు.2014 ఎన్నికల నుండి కలిసి ముందుకు నడుస్తున్న ఈ ఇద్దరు మిత్రుల మధ్య ఇటీవల కాలంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అధికారంలో వున్న టిడిపి ప్రభుత్వంపై, మిత్రపక్షమైన బిజేపికి చెందిన నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బిజేపి ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ లు టిడిపి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయటంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందచేస్తున్న చంద్రన్న పథకంలో నాసిరకం సరుకులు అందిస్తున్నారని విమర్శిస్తున్నారు.

Tags : TDP, BJP divorce !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *