ఉక్రెయిన్ విద్యార్థులకు టిడిపి అండ..

– కాకినాడ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్
గోకవరం ముచ్చట్లు:
స్థానిక దేవి సెంటర్ లో అమల లేబరేటరీస్ అధినేత పెద్ది సత్యనారాయణ కుమారుడు  పెద్ది మనోజ్ ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తూ యుద్ధం కారణంగా భారత ప్రభుత్వ సహకారంతో స్వస్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారి ఇంటికి వెళ్లి పలకరించి యోగక్షేమాలు మరియు ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం సంబంధించిన విషయాలను కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణంలో అల్లాడుతున్న విద్యార్థినీ విద్యార్థులను జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూమ్ యాప్ ద్వారా వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారని, భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులను స్వదేశానికి చేర్చడంలో విజయవంతం అయిందని, ఇంకా ఎవరైనా విద్యార్థులు ఉంటే వారిని కూడా త్వరితగతిన స్వస్థలాలకు చేర్చాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, జయ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ రమేష్, పాండ్రంగి రాంబాబు, డేగల సత్తి బాబు, కొండ్రుతు శ్రీను, వాక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
Tags:TDP egg for Ukrainian students ..

Natyam ad