వీఆర్ఏల రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన టిడిపి నాయకులు

* వీఆర్ఏల డిమాండ్లను స్పందన కార్యక్రమంలో తహసిల్దార్ కు అందజేత
తుగ్గలి ముచ్చట్లు:
 
మండల కేంద్రమైన తుగ్గలిలో వీఆర్ఏల ఏడవ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా వీఆర్ఏ సంఘం జిల్లా మరియు మండల నాయకులు వీఆర్ఏ డిమాండ్లను స్పందన కార్యక్రమంలో తుగ్గలి తహసిల్దార్ నజ్మా భానుకు అందజేశారు.అనంతరం నెల్లూరు జిల్లా గూడూరు మండలం లో రిలే నిరాహారదీక్ష కూర్చొని మరణించిన వీఆర్ఏ కృష్ణయ్య కు మండల విఆర్ఏలు నివాళులర్పించారు. తుగ్గలిలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద విఆర్ఏలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు సోమవారం రోజున తుగ్గలి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు.ఏడవ రోజు వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలో భాగంగా తుగ్గలి మండలం టిడిపి మండల అధ్యక్షులు తిరుపాల్ నాయుడు,మండల తెలుగు యువత కార్యదర్శి మోహన్ దీక్షలో కూర్చునటువంటి వీఆర్ఏలకు శాలువాల కప్పి పూలమాల వేసి దీక్షకు సంఘీభావం తెలియజేశారు.గ్రామ స్థాయిలో వీఆర్ఏలు చాలా కీలకంగా పనిచేస్తున్నారని వారికి యొక్క డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చాలని వారు తెలియజేశారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన వీఆర్ఏల డిమాండ్లు నెరవేర్చాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి మండలం తుగ్గలి మండలం వీఆర్ఏలు,టిడిపి నాయకులు బాలన్న,శివ రాముడు, జొన్నగిరి సర్పంచ్ ఓబులేసు,ఎద్దులదొడ్డి శ్రీను,తిమ్మప్ప, శ్రీనివాసులు,వెంకటేశ్వర్లు,కృష్ణయ్య మరియు తెలుగు యువత మండల అధ్యక్షులు సత్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags; TDP leaders express solidarity with VRA relay hunger strike

Natyam ad