సిఐడి కార్యలయానికి వచ్చని టీడీపీ నేతలు

విజయవాడ ముచ్చట్లు:
 
టీడీపీ నేత అశోక్ బాబు అరెస్ట్ సమాచారం తెలుసుకుని పలువురు తెదేపా నేతలు గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. సీఐడీ కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అశోక్ బాబును కలుసుకునేందుకు దేవినేని ఉమతో పాటు పలువురు తెదేపా నేతలు రాగా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉమతో పాటు.. తెదేపా నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చిరాం ప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తిలను అరెస్ట్ చేశారు. అశోక్బాబుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెదేపా నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజుని కూడా కొట్టారన్న నేతలు.. అందుకే అశోక్ బాబును చూపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
 
Tags; TDP leaders who did not come to the CID office

Natyam ad