TDP Party Party Loot Party - Peddireddy

తెలుగుదేశం పార్టీ దోపిడి పార్టీ – పెద్దిరెడ్డి ధ్వజం

Date : 19/12/2017

సదుం ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ దోపిడి పార్టీగా మారిందని వైఎస్సాఆర్సీపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. సదుంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ప్రతి రోజు ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందని దానిని పట్టించుకోలేదన్నారు. అలాగే పొలవరం, పట్టిసీమ, హంద్రినీవా ప్రాజెక్టులో భారీ కుంభకోణాలు జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలలో జన్మభూమి కమిటి సభ్యులు అక్రమాలకు పాల్పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ అధ్యక్షుడు పులివర్తినాని వీటిపై చర్యలు తీసుకోకుండ సదుం మండలంలో అక్రమాలు జరుగుతోందని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాసేవలో నీతినిజాయితీగా పని చేస్తున్నారని కొనియాడారు. అవినీతి అక్రమాలను ఎనాడు ప్రోత్సహించలేదన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.

Tags ; TDP Party Party Loot Party – Peddireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *