TDP violations have increased

టీడీపీ దౌర్జన్యాలు పెరిగిపోయాయి 

Date:15/09/2018
గుత్తి ముచ్చట్లు
తెలుగుదేశం ప్రభుత్వం పతనం అవుతోంది. చంద్రబాబు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు.  కోర్టు నుంచి కేవలం నోటీసులు రాగానే కుట్ర అంటూ సానుభూతి పొందే  ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ వైకాపా అనంతపురం జిల్లా ఇంచార్జ్ మిథున్ రెడ్డి ఆరోపించారు. శనివారం అయన గుత్తి ఆర్ అండ్ బీ అతిధి గృహంలో మీడియాతో మాట్లాడారు.
అనంతపురం జిల్లాలో రోజురోజుకీ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయి.  తాడిపత్రి నియోజవర్గంలో జేసీ సోదరులైతేనేమీ,  హిందూపురం, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో న్యాయ వ్యవస్థలు నడవడం లేదని అయన విమర్శించారు.
పెద్దారెడ్డి పై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో ఉంచారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలపై కేసులు పెడతామని భయపెడుతున్నారు. పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు.  కొంతమంది అధికారుల వల్ల పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెడ్డ పేరు వస్తోందని అయన అన్నారు.
ఈ ప్రభుత్వం ఐదారు నెలలు మాత్రమే ఉండబోతుంది. వైఎస్సార్సీపీ విజయం ఖాయం అని అన్ని సర్వేలు చెబుతున్నాయి.  అనంతపురం జిల్లా పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని అయన అన్నారు.
Tags:TDP violations have increased

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *