Natyam ad

టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, రబ్బర్ల దశాబ్దాల నాటి చట్టాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి…?

ఢిల్లీ ముచ్చట్లు:
. ఈ పాత చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ రంగాల వృద్ధి కోసం కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని, వ్యాపారాల కోసం మెరుగైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కొత్త బిల్లులను తీసుకొచ్చింది. సుగంధ ద్రవ్యాల డ్రాఫ్ట్(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు 2022, రబ్బర్(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు 2022, కాఫీ(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు 2022, టీ(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు 2022లను వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఈ డ్రాఫ్ట్ బిల్లులపై వాటాదారుల నుంచి అభిప్రాయాలు కోరుతోంది. ఈ నాలుగు బిల్లులపై వచ్చే నెల 9వ తేదీ వరకు ప్రజలు, వాటాదారులు తమ అభిప్రాయాలను టీ చట్టం 1953, సుగంధ ద్రవ్యాల చట్టం 1986, రబ్బర్ చట్టం 1947, కాఫీ చట్టం 1942ను రద్దు చేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న వాస్తవ పరిస్థితులను, ఉద్దేశ్యాలను పరిగణనలోకి తీసుకుని కొత్త బిల్లులను వాణిజ్య మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో టీ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది. దీన్ని మార్కెట్ చేసే విధానం, వినియోగం కూడా చాలా మారింది. దీంతో ప్రస్తుతమున్న ఎన్నో ఏళ్ల నాటి చట్టాన్ని సవరించాల్సి ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇలాగే టీ ప్రోత్సాహకానికి, టీ వర్కర్లు స్కిల్ డెవలప్‌మెంట్‌కు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపింది.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Tea, Coffee, Spices, Rubber Central government repeals decades-old laws …?