ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసుకోవచ్చు

విజయవాడ ముచ్చట్లు:
 
ఫిట్ మెంట్, హెచ్ఆర్ఏ అంశాల పై ఉపాధ్యాయ సంఘాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సమావేశమయ్యారు స్టీరింగ్ కమిటీ నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి. ఉపాధ్యాయ సంఘాల తీరు పై జేఏసీ నేతలు మండిపడ్డారు. పీఆర్సీ సాధన సమితి కృషి వల్ల హెచ్ఆర్ఏ విషయంలో తెలంగాణకు సమానంగా తెచ్చుకున్నాం అన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. పీఆర్టీ ఐదేళ్లకు ఒకసారి ఏర్పాటు అయ్యేలా చూశాం. అదనపు పెన్షన్, సీసీఏ వచ్చింది. కొందరు మాతో ప్రతి అంశంలో చర్చలో ఉన్నారు..అప్పుడే వాళ్ళు చర్చ నుంచి బయటకు రావాల్సిందన్నారు.ఫిట్మెంట్ ఒక్కటే ప్రధానం అనుకున్నప్పుడు అప్పుడే బయటకు వచ్చి చెప్పాల్సింది. సమ్మె ఆపుదాం అన్నప్పుడు సరే అన్నారు. వారిని ఎవరో ప్రభావితం చేస్తున్నారన్నారు వెంకట్రామిరెడ్డి. స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలపై చేస్తున్న దుష్ప్రచారానికి ధన్యవాదాలు. బాధ్యత కలిగిన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎవరూ ఇలా చెయ్యరు. ప్రజాస్వామ్యంలో నచ్చని నిర్ణయంపై నిరసన తెలపడానికి అనేక మార్గాలున్నాయి.వేరే శక్తులు ఉపాధ్యాయుల ఆందోళనలో ఉన్నారనే అనుమానాలు ఉన్నాయన్నారు సూర్యనారాయణ. ఉద్యమంలోఉన్నప్పుడు అన్నీ భరించాలి…లేకపోతే నాయకులు అనిపించుకోరు.ఉద్యోగులు విమర్శలు చేస్తు వాట్సాప్ సందేశాలు ఎవరికీ పంపవద్దు. వచ్చినవి మా వల్లే వచ్చాయని..రాకపోవడానికి ఆ నలుగురు కారణం అని చెప్పడం విచిత్రంగా ఉంది. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసుకోవచ్చు.. కానీ వాస్తవాలు మాట్లాడాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రయోజనం కన్నా ఇంకా వేరే ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నారు. చర్చల వల్ల అసంతృప్తి ఉంటే సమ్మెకు వెళ్ళవచ్చు కదా. ఈనెల ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాల్సింది అన్నారు స్టీరింగ్ కమిటీ నేతలు.
 
Tags; Teacher unions may be concerned

Natyam ad