Teachers with false caste

 తప్పుడు కులంతో ఉపాధ్యాయులు

Date:18/06/2018
వరంగల్ అర్బన్ ముచ్చట్లు:
తప్పుడు కులం సర్టిఫికెట్లతో ఉపాధ్యాయులుగా ఉద్యోగం వెలగబెడుతున్న వారి బాగోతం కలకలం రేపుతోంది. భూపాలపల్లి మండలం జంగేడు జడ్పీఎ్‌సఎ్‌సలో ముగ్గురు ఉపాధ్యాయులు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారని మరో ఉపాధ్యాయుడు కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు మున్నూరుకాపు(బీసీ-డి) సర్టిఫికెట్లతో ముగ్గురు ఉద్యోగాలు చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
భూపాలపల్లి మండలం జంగేడు జడ్పీఎ్‌సఎ్‌సలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న దూదిపాల సాంబరెడ్డి, గుజ్జుల రాజేంద్రమ్మ, రేగూరి సుభాకర్‌లపై గతంలో ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి సస్పెన్షన్‌ అనంతరం బదిలీపై వెళ్లిన ఆర్‌.సారంగపాణి అనే ప్రధానోపాధ్యాయుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వీరు వాస్తవంగా రెడ్డి కులస్తులని, కానీ చదువు నుంచి మొదలు ఉద్యోగాల వరకు మున్నూరుకాపు(బీసీ-డీ) పేరుతో ఉద్యోగాలు చేస్తున్నారని, కొందరైతే మధ్యలో రెడ్డి కులం(ఓసీ కేటగిరీ) పేరుతో టీచర్‌ ట్రైనింగ్‌ కూడా చేశారని ఆరోపించారు.
జంగేడు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దూదిపాల సాంబరెడ్డి మున్నూరుకాపు కాదు రెడ్డి సామాజికవర్గమేనని సారంగపాణి ఆ ఫిర్యాదులో ఆర్‌టీఐ ద్వారా సేకరించిన ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన సాంబరెడ్డి చదువును మాత్రం దూదిపాల సాంబయ్య మున్నూరుకాపుగా కొనసాగించారని, టీచర్‌ ట్రైనింగ్‌ మాత్రం(ఓసీ) రెడ్డిగా పూర్తి చేసుకుని 2001 డీఎస్సీ ద్వారా ఉద్యోగంలో చేరారన్నారు. ఆ తరువాత ఎస్‌జీటీ నుంచి ఎస్‌ఏగా పదోన్నతి పొందిన తరువాత 2012లో స్కూల్‌ రికార్డులో డీఈవో కార్యాలయంలో దూదిపాల సాంబ య్య పేరును దూదిపాల సాంబరెడ్డిగా మార్చుకున్నట్లుగా ఫిర్యాదులో ఆరోపించారు.
నకిలీ కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాలయం నాగార్జునసాగర్‌ నల్గొండలో బీసీ-డీ కోటాలో 8 నుంచి వ తరగతిలో సీటు పొందారని, ఉచిత వసతి, భోజనం, దుస్తులు ఇతర సౌకర్యాలు 10వ తరగతి వరకు పొందారని ఆరోపించారు. అలాగే ఇంటర్‌తో పాటు అన్ని సౌకర్యాలు మున్నూరుకాపు కోటాలోనే పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిగ్రీ కేడీసీలో మున్నూరుకాపు కోటాలోనే సీటు పొందారని, ఎడ్‌సెట్‌లో ఎక్కువ మార్కులు రావడంతో బీఈడీ కళాశాల రికార్డుల్లో ఓసీగా నమోదు చేసుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సాంబరెడ్డికి సంబంధించి రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక పరకాల మండలం నాగారానికి చెందిన గుజ్జుల రాజేంద్రమ్మ సామాజిక వర్గం రెడ్డి అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 1994-95 విద్యాసంవత్సరంలో బీఈడీలో నకిలీ మున్నూరుకాపు సర్టిఫికెట్‌తో పూర్తి చేశారని, 1996లో ఎస్‌జీటీగా ఉద్యోగం పొందారని ఆరోపించారు. ఈ విషయంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సారంగపాణి కలెక్టర్‌ను కోరారు.
పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన రేగూరి సుభాకర్‌ వాస్తవంగా రెడ్డి సామాజిక వర్గమని, ఈయన 6 నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్‌, డైట్‌ కళాశాల వరంగల్‌లో టీచర్‌ ట్రైనింగ్‌ మున్నూరుకాపు సర్టిఫికెట్‌తో పూర్తిచేశారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. 2001 డీఎస్సీ ద్వారా ఎస్‌జీటీగా నియామకం అయ్యారని తెలిపారు. ఉద్యోగం చేస్తూ అంబేద్కర్‌ ఓపెన్‌వర్సిటీలో నకిలీ కుల ధ్రువీకరణతో బీఎస్సీ పూర్తి చేశారని ఆరోపించారు.
రేగూరి సుభాకర్‌ ఇన్‌సర్వీ్‌స సర్టిఫికెట్‌ ఆధారంగా ఓసీ కోటాలో అంబేద్కర్‌ ఓపెన్‌వర్సిటీలో బీఈడీ 2011లో పూర్తి చేసి జనవరి 2012లో పదోన్నతి పొంది జడ్పీఎ్‌సఎస్‌ జంగేడులో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సమగ్రంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ముగ్గురికి సంబంధించి వివిధ పాఠశాలలు, ట్రైనింగ్‌ కళాశాలలు, యూనివర్సిటీల నుంచి ఆర్‌టీఐ ద్వారా తీసుకున్న ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలను ఫిర్యాదుతో జతపరిచి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు టీచర్లను వివరణ కోరేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించిన విషయంలో ఆరుగురు ఉపాధ్యాయులపై ఏప్రిల్‌ 20న మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు విచారణ పూర్తి చేశారు. నెల్లికుదురుకు చెందిన పోతుల ప్రేమ్‌చందర్‌, వర్థన్నపేటకు చెందిన పోతుల సరస్వతి, మహబూబాబాద్‌కు చెందిన సోమ శ్రీనివాస్‌, కళ్లెం వీరారెడ్డి, కేసముద్రంకు చెందిన కొప్పుల శంకర్‌, వరంగల్‌ రాగంపేటకు చెందిన గంజి సరళాదేవి.. తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు పెట్టి ఉద్యోగాలు సాధించారని సమాచార హక్కుచట్టం ద్వారా సేకరించిన మున్నూరు కాపు సంఘం నేతలు అప్పటి ఉమ్మడి వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ కరుణకు పిర్యాదు చేశారు. పలుదఫాలుగా విచారణ చేశారు. నూతన జిల్లాల ఆవిర్భావంతో మహబూబాబాద్‌ ప్రాంతానికి చెందిన సదరు ఆరుగురు ఉపాధ్యాయులపై జిల్లా స్థాయి విచారణ కమిటీ కన్వీనర్‌, జేసీ దామోదర్‌రెడ్డి నేతృత్వంలో సభ్యులు విచారణ చేపట్టారు. మార్చి 22న చేపట్టాల్సిన విచారణ వాయిదా పడింది. మార్చి 29న సదరు ఉపాధ్యాయుల పత్రాలను పరిశీలించారు. ఏప్రిల్‌ 20న ఉపాధ్యాయులను పూర్తి ఆధారాలతో మళ్లీ విచారణకు రావాలని కోరారు. జేసీ దామోదర్‌ రెడ్డి అఽధ్యక్షతన విచారణ కమిటీ సభ్యులు జిల్లా ట్రైబల్‌ వెల్పేర్‌ అధికారి నారాయణస్వామి, బీసీ సంక్షేమ అధికారి ఇందిరాదేవి,ఎస్సీ సంక్షేమాధికారి రాజు, తహసీల్ధార్‌ యోగీశ్వర్‌రావులు విచారించారు. తుది నివేదికను ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది.
Tags:Teachers with false caste

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *