మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్

చిరు బర్తడే రోజున టీజర్

Date:20/07/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రంగస్థలం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం తరువాత మాస్ మసాలా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ప‌వ‌ర్ ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు రామ్ చరణ్. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌‌లో డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా మూవీ ఫస్ట్ లుక్‌, టైటిల్‌ అనౌన్స్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉండబోతుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం. ఈ మూవీలో చెర్రీ సరసన ‘భరత్ అనే నేను’ హీరోయిన్ కియారీ అద్వానీ జోడీ కడుతుండగా.. తమిళ నటుడు ప్రశాంత్‌, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం.. రిషి పంజాబి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన అప్ కమింగ్ మూవీ ‘సైరా’ టీజర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతుండగా అధికారిక సమాచారం రావాల్సిఉంది.
చిరు బర్తడే రోజున టీజర్ http://www.telugumuchatlu.com/teaser-on-the-day-of-cheetah/
Tags:Teaser on the day of cheetah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *