పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ ముచ్చట్లు:
అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్)లో సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసం చేశారు. వ్యక్తిగతంగా సదస్సుకు వచ్చిన వారిని స్వాగతించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగిన జీఈఎస్ సదస్సులో ఆయన మాట్లాడారు. జీఈఎస్ సదస్సును ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుక ద్వారా హైదరాబాదీ క్యారెక్టర్ను అనుభవిస్తారనుకుంటారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి లభిస్తోందన్నారు. టీఎస్ ఐపాస్ విశిష్టమైన విధానమని, ప్రభుత్వం 15 రోజుల్లో అనుమతి ఇవ్వకుంటే, అది వచ్చినట్లుగానే భావించాలన్నారు. గత కొన్నేళ్లలో 5,469 ఇండస్ట్రియల్ యూనిట్లకు అనుమతి ఇచ్చామన్నారు.కొన్ని వేల ఉద్యోగాలు కల్పించామన్నారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనూ తెలంగాణకు నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిందన్నారు. ఇప్పుడు తెలంగాణ.. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కు కేంద్రంగా మారిందని కేసీఆర్ అన్నారు. ఆపిల్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి సంస్థలు హైదరాబాద్లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయన్నారు. తెలంగాణలో స్టార్టప్ వాతావరణం అద్భుతంగా ఉందన్నారు. పెట్టుబడీదారులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందన్నారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో కొత్త ఐడియాలు, ప్లాన్స్ వస్తాయని ఆయన ఆశించారు. తెలంగాణ ఇస్తున్న ఆతిథ్యాన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
Tag : Telangana haven for investors: CM KCR


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *