ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత.

విశాఖపట్నం ముచ్చట్లు:
 
ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీగా మొహరించారు. ఛలో ఏయూ పిలుపు నేపథ్యంలో టిడిపి కీలక నేతలు గృహ నిర్భందం చేసారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డిని తక్షణమే రీకాల్ చేయాలని అందోళన కారులు డిమాండ్ చేసారు. అయితే ఛలో ఆంధ్ర యూనివర్సిటీకి పోలీసుల అనుమతి నిరాకరించారు.
ముందస్తుగానే పలు రాజకీయ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాలు నేతలు అరెస్టులు అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హౌస్ అరెస్ట్ అయ్యారు. జనసేన నేతలు కోన తాతారావు, రామకృష్ణ,  దల్లి గోవిందరెడ్డి, టి.డి.పి చెందిన పుచ్చా విజయకుమార్ , మొల్లి పెంటిరాజు, సి.పి.యం సుబ్బారావు, మాటూరి చిన్నారావులు హోస్ అరెస్టయ్యారు.  జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఉద్రిక్తత నెలకొంది.చలో ఏయు నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన  54 వార్డు టిడిపి  ప్రెసిడెంట్ పుట్టా కార్తిక్,  47 వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ రాజారావులను పోలీసులు అరెస్టు చేసారుజ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గరికి వస్తున్న ఆందోళన కారులను పోలీసులు  వచ్చిన వారిని వచ్చినట్టు అదుపులోకి తీసుకున్నారు.
 
Tags:Tension at Andhra University

Natyam ad