రష్యా- ఉక్రెయిన్ మధ్య టెన్షన్

మాస్కో ముచ్చట్లు:
 
ఁయుక్రెయిన్‌తో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రష్యా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర స్టేట్స్‌గా ప్రకటించారు. ఈ మేరకు డిక్రీపై సంతకం చేశారు. వెంటనే ఆ రెండు ప్రాంతాలకు వెళ్లాలని రష్యన్ ఆర్మీని ఆదేశించారు.రష్యా నిర్ణయంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది అమెరికా. ఈ క్రమంలోనే అధ్యక్షుడు జో బిడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లలో ఎటువంటి కొత్త పెట్టుబడులు, వ్యాపారం, ఫైనాన్సింగ్‌ చెయ్యరాదని, నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ తీసుకుని వచ్చారు.అదే సమయంలో, యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటనలో, “డొనెట్స్క్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్” అని పిలవబడే రెండు ఫ్రావిన్సులను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. యూరోపియన్ యూనియన్ యుక్రెయిన్ వేర్పాటువాద భూభాగాలను గుర్తించడానికి రష్యా తీసుకున్న చర్యను అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే అని అభిప్రాయపడింది.రష్యా ఎప్పుడైనా యుక్రెయిన్‌పై దాడి చేయవచ్చని, తూర్పు యుక్రెయిన్‌లో ఘర్షణలను దాడికి సాకుగా ఉపయోగించవచ్చని పాశ్చాత్య దేశాలు భయపడుతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు పుతిన్ సైన్యాన్ని పంపాలని ఆదేశించారు.యుక్రెయిన్ ఉత్తర సరిహద్దులో ఉన్న బెలారస్‌లో 30,000 మంది సైనికులను మోహరించింది. దీనితో పాటు ఉక్రెయిన్ సరిహద్దుల్లో 150,000 మంది సైనికులు, యుద్ధ విమానాలను, ఇతర సామగ్రిని మోహరించింది. కీవ్‌లో దాదాపు 30 మిలియన్ల జనాభా ఉంది.
 
Tags: Tension between Russia and Ukraine

Natyam ad