ఆర్మూర్‌లో టెన్షన్… టెన్షన్  – దీక్షకు సిద్ధమైన రైతులు

-అనుమతి నిరాకరించిన పోలీసులు
– 144 సెక్షన్‌ విధింపు
Date:15/02/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
 జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మద్దతు ధర కోసం ఎర్రజొన్న, పసుపు రైతులు దీక్షకు సిద్ధమయ్యారు. అయితే… దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే పట్టణంలోకి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా… రైతుల దీక్షకు ఆయా పార్టీల మద్దతు కూడా తెలపడంతో ఆ పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా తరలిరాగా దీక్షా స్థలి వద్ద భారీ జనసందోహం కనబడుతోంది. కాగా… రైతుల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఎటువంటి ర్యాలీలు, సభలు నిర్వహించకుండా 144 సెక్షన్ విధించారు. దీంతో టెన్షన్ వాతావరణం ప్రస్తుతం అక్కడ నెలకొంది. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ఇళ్ళ వద్ద కూడా పోలీసులు భారీగా బందోబస్తు కల్పించారు.
Tags: Tension in Armor … tension – farmers ready for initiation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *