బద్వేలు లో ఉద్రిక్తత

కడప ముచ్చట్లు:
 
కడప జిల్లా బద్వేలు లో రోజురోజుకు పెరిగిపోతున్న రౌడీ  ఇజం కులాల వారీగా విడిపోయి ఒక వర్గం పై మరొక వర్గం దాడి చేసింది. ఈ దాడులకు రాజకీయ రంగు పులుముకావడంతో ఉద్రిక్తతంగా  మారి  బాధితులు పోలీసుస్టేషన్ ను చుట్టుముట్టారు.  గతంలో ఒక వర్గం  స్టేషన్ ఎదుట ఆందోళన చేయడంతో మేమేమీ వారికి తక్కువ కామని మరోవర్గం  ఈరోజు ఆందోళనకు దిగింది.. ఆడవారి పై విచక్షణా రహితంగా దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని  పోలీస్ స్టేషన్ ను  చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులు ఒకానొక దశలో నాలుగు రోడ్ల సెంటరులో ట్రాఫిక్ కు  సైతం  అంతరాయం కలిగించారు.  ఆందోళన కారులను నిలువరించడానికి విఫలయత్నం చేసారు.  పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని అన్నారు. వారిలో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని  మిగతా వారిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని ఆందోళనకారులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ఇలాంటి వర్గ పోరుకు రాజకీయ రంగు పులుముకోవడం గమనార్హం.ఇలాంటి పరిస్థితులను అదుపు చెయ్యటంలో పోలీసులకు   తలనొప్పిగా మారినది.
 
Tags: Tension in Badwell

Natyam ad