ఏయూలో ఉద్రిక్తత.

విశాఖపట్నం ముచ్చట్లు :
విశాఖ ఏయూ రణరంగాన్ని తలపించింది.ఏయూలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు విద్యార్థి సంఘాలు చలో ఆంధ్రా యూనివర్సిటీ పిలుపునిచ్చింది.మరోవైపు ఇందుకు పోటీగా ఏయూ పరిరక్షణ పోరాట సమితి మహాధర్నాకు సిద్దమైంది. దీంతో యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎటువంటి ఘర్షణచోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. యూనివర్సిటీకి చెందిన మూడు గేట్లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గేట్ల గుండా కేవలం ఐడీ కార్డులు ఉన్నవారినే పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు.ఏయూ పరిసరాలకు చేరుకుంటున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి సమీప పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే తాము ఎలాగైనా చలో ఏయూ చేపడతామని విద్యార్థిసంఘాల నాయకులు చెబుతున్నారు.ఆంధ్రా వర్సిటీలో ఎత్తివేసిన 20 కోర్సులను తక్షణమే పునరుద్దరించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు విశాఖ ఆంధ్రా యూనివర్సిటికిపలు రాజకీయ నాయకులు ర్యాలీగా తరలిరావడంతో అలెర్ట్ అయిన పోలీసులు వారిని అరెష్టు చెయ్యడంతో ఏయూ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్ధితులు తలెత్తాయి.
 
Tags:Tension in the AU

Natyam ad