Thambalapalli MLA is fraudulent by the name of Flash ..... Flash plot

ఫ్లాష్‌…..ఫ్లాష్‌ ప్లాట్ల పేరుతో తంబళ్లపల్లె ఎమ్మెల్యే మోసం

Date:09/12/2017

Thambalapalli MLA is fraudulent by the name of Flash ..... Flash plot
Thambalapalli MLA is fraudulent by the name of Flash ….. Flash plot

మదనపల్లె ముచ్చట్లు:

సొంత ఇంటి కళ నేరవేర్చుకోవడం కోసం లక్షల రూపాయలు చెల్లిస్తే ఇప్పటి తంబళ్లపల్లె శాసనసభ్యుడు శంకర యాదవ్‌ నిలువునా మోసం చేశాడని బాధితులు న్యాయం కోసం రోడ్డుకెక్కారు. బెంగళూరు దేవనహళ్లిలో తమకు విక్రయించిన పొలాలు ఎస్సీలకు చెందినవిగా తెలిసినప్పటికి నమ్మించి సొమ్ము చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంగా పది సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న పట్టించుకోలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంగా శనివారం చిత్తూరు జిల్లా, మదనపల్లెలో బాదితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రెస్‌ క్లబ్‌కు వచ్చిన బాధితులు విలేకరుల ఎదుట తమ గోడు చెప్పుకున్నారు. ఎమ్మెల్యే శంకర్‌ ఎమ్మెల్యే కాక ముందు 2006 సంవత్సరంలో దేవనహాళ్ళిలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో భాగంగా తమకు ఇంటి స్థలాలు విక్రయించినట్లు బాధితులు పేర్కొన్నారు. ఐశ్వర్యహ్గమ్స్, డేవలపర్స్ మరియు బిల్డర్స్ సంస్థ తరపున 2006లో 35 మందికి స్థలాలు విక్రయించారు. మేమంతా పూర్తి సొమ్ము, స్థలం అభివృద్ధికి అయిన ఖర్చులను మా నుంచి తీసుకోవడం జరిగింది. దేవనహాళ్లి దగ్గర ఉన్న సర్వేనెంబర్లు: 77, 89 మరియు 91లో నాకు ఇంటి స్థలాలు ఇచ్చినారు. కానీ ఆ స్థలం తమదని ఎస్సీ,ఎస్టీలకు చెందిన వారు బోర్డు నాటి స్థలం చుట్టు జెండాలను పాతి ఉన్నారు. ఈ విషయంలో సమస్య పరిష్కారం కోసం నాలుగు నెలల క్రిందట ఎమ్మెల్యే శంకర్‌ని కలిసి మాట్లాడాను. నాలుగు దినాలలో సమస్య పరిష్కరిస్తానని ఆయన మాట ఇచ్చారు. తదుపరి మేము పలుమార్లు శంకర్‌కు ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఇప్పుడు మేము డబ్బులు చెల్లించినా స్థలాలను పొందలేని పరిస్థితులలో ఉన్నాము. ఇప్పటికే 12 సంవత్సరాలు గడిచిపోయాయి. సత్వరమే మాకందరికి ఎమ్మెల్యే శంకర్‌ న్యాయం చేయాలని వేడుకుంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు బాధితులు పాల్గొనగా విలేకరులకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేశారు.

శంకర్‌పై పదుల కేసులు ….

ఎమ్మెల్యే శంకర్‌పై భూ సంబధిత కేసులు పదుల సంఖ్యలో ఉన్నాయి. 2014 అసెంబ్లి ఎన్నికల సందర్భంగా టీడీపి అభ్యర్థిగా తంబళ్లపల్లెలో పోటీ చేశారు. ఆ సమయంలో శంకర్‌ పోలీస్‌ స్టేషన్‌లో, కోర్టుల్లో తనపై 40 వరకు కేసులు ఉన్నట్లు అపడవిట్‌లోను పేర్కొన్నారు. ఇవి కాకుండ వెలుగుచూడని కేసులు ఇంకా ఎన్నో ఉన్నాయని వినవస్తున్నాయి. స్వతహాగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి అయిన శంకర్‌ 2009లో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓడిపోయారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఇప్పటి దాక వివాదాలన్ని కేసుల ద్వారా నడుస్తున్నాయి. అయితే తొలి సారిగా బాధితులు బహిరంగంగా ఎమ్మెల్యే మాకు న్యాయం చేయాలంటు బయటకు రావడం విశేషం.

Tag: Thambalapalli MLA is fraudulent by the name of Flash ….. Flash plot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *