తొలగించిన 107 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
సీపీఐ ఎఐటియుసి నాయకుల డిమాండ్
నంద్యాలముచ్చట్లు:
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వివిధ శ్రేణుల్లో 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నంద్యాల ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో రవి కుమార్ కి వినతి పత్రం అందజేశారు . సిపిఐ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ ఏ ఐ టి యు సి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి సుబ్బరాయుడు సిపిఐ గోస్పాడు మండల కార్యదర్శి చెన్నయ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ వ్యవసాయ కార్మిక సంఘం గోస్పాడు మండల కార్యదర్శి హరినాథ్ ఏఐటియుసి గోస్పాడు మండల కార్యదర్శి సుబ్బయ్య సిపిఐ నాయకులు జిలాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కర్నూల్ ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న 107 మంది కార్మికులను నిర్ధాక్షణ్యంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నపళంగా వారిని విధుల నుండి తొలగించడం జరిగిందని తెలిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గత నలభై రోజులు నుండి వివిధ రూపాలలో నిరసనలు ధర్నాలు రిలే దీక్షలు నిర్వహించి సూపరింటెండెంట్ కార్మిక శాఖ అధికారులకు మినిస్టర్ లకు తెలియపరిచిన ఫలితం లేదన్నారు. సిపిఐ ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించి 107 మంది మెడికల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను విధుల్లోకి తీసుకునేంతవరకు పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి సుశీలమ్మ రవి తులసమ్మ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags: The 107 laid-off workers should be hired
