The 30th day of the general dilemma is the extraordinary salute

జనగణమనకు 30వ రోజు అపూర్వ వందనం

– చైర్‌పర్శన్‌ షమీమ్‌, వైస్‌ అమరేంద్ర,
– అధికారులు హాజరు

Date:15/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో గత నెల ఆగస్టు 15న జనగణమన ప్రారంభించారు. 30 రోజులు పూర్తి అయిన సందర్భంగా జనగణమన జాతీయ గీతానికి పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు , అధికారులు, అందరు కలసి భక్తితో గౌరవ వందనం చేశారు. కమిషనర్ కేఎల్ వర్మ ఆధ్వర్యంలో నిరంతరం జరుగుతున్న జాతీయ గీతాలాపన కార్యక్రమానికి  ముఖ్య అతిధులుగా చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌, వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, తహశీల్ధార్‌ మాదవరాజు, ట్రాన్స్కో ఏడి వేణుగోపాల్‌రెడ్డి, ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి, అడిషినల్‌ సెషన్స్ కోర్టు పిపి చెన్నకేశవులు,  లయన్స్ క్లబ్  జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ పి.శివ, జెఏసి చైర్మన్‌ జి.వరదారెడ్డి ,ట్రాన్స్కో ఏఈలు శశికుమార్‌, విశ్వనాథరెడ్డి, ఎక్సెజ్‌ ఎస్‌ఐ రామక్రిష్ణ , వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.రెడ్డెప్ప, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ ఉద్యో గ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్దిన్‌ షరీఫ్‌, చౌడేపల్లె ఎంపిపి అంజిబాబు, అంజుమన్‌ సెక్రటరీ అమ్ము, రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి, హాజరైయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు ,మహిళా సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రజలు , విద్యార్థులు కలసి ఇందిరా సర్కిల్‌లో మానవహారంగా నిలబడ్డారు. జాతీయ గీతాలాపన ఆలపించి, గౌరవ వందనం సమర్పించారు.అలాగే పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌లో, బస్టాండు, ఇందిరా సర్కిల్‌, కెకె సర్కిల్‌ ,గాంధినగర్‌ సర్కిల్‌, తూర్పువెహోగశాల ప్రాంతాలలో జనగణమన కార్యక్రమం జాతీయ పతాకాన్ని పట్టుకుని నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో కౌన్సిలర్లు మనోహర్‌, జనగణమన కమిటి సభ్యులు ప్రకాష్‌, అయూబ్‌ఖాన్‌, శ్యామ్‌ప్రసాద్‌, దీపక్‌, ముత్యాలు, ఒలంపిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ గిరిధర్‌, కాంగ్రెస్‌ నాయకుడు సజ్జాద్‌, ముస్లిం నాయకులు, న్యాయవాదులు షమివుల్లా, జహుర్‌బాషా, ఖాదర్‌బాషా, సిద్దు, ఖాదర్‌, ఇంతియాజ్‌, షామిర్‌, ఖాదర్‌బాషా, గౌస్‌ఖాన్‌, తజ్జుబాషా, బావాజాన్‌,కాపు సంఘ నాయకులు కొండవీటి నటరాజ, మురళి, హరి, గంగాధర్‌, యువజన సంఘ నాయకులు వెంకటేష్‌, పిడిఎఫ్‌ అధ్యక్షుడు భానుప్రసాద్‌, ఎస్సీసెల్‌ నేతలు రాజా, వినాయక యువజన సంఘ నాయకులు కుమార్‌, నాగరాజ, మున్సిపల్‌ ఐకెపి టౌన్‌కో-ఆర్డినేటర్‌ మధుసూధన్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌, మున్సిపల్‌ కాంట్రాక్టర్‌ శ్రీరాములు,ఎస్‌డిపీఐ , పిడిఎఫ్‌ నేతలు ఫయాజ్‌, ఆసిఫ్‌, అతిక్‌ తో పాటు మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు, పెద్దిరెడ్డి యువజన సంఘ నాయకులు చందా రెడ్డెప్పరెడ్డి, రాజేష్‌, సురేష్‌, జయరాం, హేము, కుమార్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కొండవీటి నాగేంద్ర, రహమత్‌బాషా, పట్టణ ప్రజలు , పండ్ల వ్యాపారులు, ఆటో డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతపురంలో నిమజ్జన గండం

Tags: The 30th day of the general dilemma is the extraordinary salute

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *