The 5th installment is the best gram panchayatai in the management of the birthplace

5 వ విడత జన్మభూమి కార్యక్రమ నిర్వహణలో ఉత్తమ గ్రామపంచాయితీగా పెద్దవెలగటూరు

Date:12/01/2018

చిత్తూరు ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 5 వ విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమ నిర్వహణలో జిల్లాలోని పెద్దపంజాణి మండలానికి చెందిన పెద్దవెలగటూరు గ్రామ పంచాయితీని ఉత్తమ పంచాయితీగా ఎంపికైంది. చిత్తూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న చేతులమీదుగా ప్రశంసాపత్రం, మెమొంటోను ఆ పంచాయితీ సర్పంచ్ వెంకట్రమణ, కార్యదర్శి విశ్వమాలిని కి అందజేశారు. ఈ విషయంపై స్థానిక ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, జెడ్పీచైర్పర్సన్ గీర్వాణి, మేయర్ కఠారి హేమలత, ఎమ్మెల్సీలు గౌని శ్రీనివాసులు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags : The 5th installment is the best gram panchayatai in the management of the birthplace

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *