The aim is to develop all kinds of pungenturas

పుంగనూరును అన్నివిధాల అభివృద్ధి చేయడమే లక్ష్యం

– అందరికి తాగునీరు సరఫరా
– హంద్రీనీవాకు నీరురాదు
– సమ్మర్‌స్టోర్‌జ్‌ ట్యాంకుకు నీరు పంపుతాం
– పట్టణంలో డ్రైనేజ్‌ ఏర్పాటు
– పరిశ్రమలు తీసుకొస్తాం
– కక్షలతో అభివృద్ధికి అడ్డు
– మాజీ ఎంపి మిధున్‌రెడ్డి.

Date:12/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నివ్యిధాలుగా అభివృద్ధి చే యడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాజంపేట మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మున్సిపల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మ్యిధున్‌రెడ్డి మాట్లాడుతూ పుంగనూరు ప్రజలు ఆశీస్సులతో తమ కుటుంబానికి ఎమ్మెల్యే, ఎంపి పదవులు లభించిందన్నారు. మీ అందరి ఆశీస్సులతో పుంగనూరుకు బైపాస్‌ రోడ్డును మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ పనులను టెండర్ల ద్వారా చేస్తున్న కాంట్రాక్టర్లు సకాలంలో చేయకపోవడంతో ఆ కాంట్రాక్టర్‌ను మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ రాజకీయ కక్షలతో తీవ్ర జాప్యం చేస్తూ, పనులు పెండింగ్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవాలు కాలువలో నీరు వచ్చే ప్రసక్తే లేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు కదిరి వరకు వచ్చి ఆగిపోతుందన్నారు. ప్రభుత్వం పుంగనూరుకు కేటాయించే నీరు చెరువును తడిపేందుకు మాత్రమే సరిపోతుందన్నారు. కుప్పం వరకు కాలువ పనులు పూర్తికాలేదని, ప్రతిసారి హంద్రనీవా నీటిని ఆరు నెలల్లో ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదమన్నారు. ధైర్యం ఉంటే హంద్రీనీవా నీరు విడుదల చేసి, ఎన్నికలకు వెళ్తామని ఇప్పుడు ముఖ్యమంత్రి , మంత్రులు మాట్లాడాలని డిమాండు చేశారు. వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే హంద్రీనీవా కాలువను పూర్తి చేసి, నీటిని విడుదల చేస్తామన్నారు. పుంగనూరు సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు తాగునీరు, సాగునీరుకోసం నిర్మించామన్నారు. ఈ ట్యాంకుకు సదుం మండలం కొర్లగుంట రిజర్వాయర్‌ ప్రాజెక్టు నుంచి పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు తాము చేపట్టిన పనులను అడ్డుకున్నారన్నారు. వైఎస్‌.జగన్‌ పాదయాత్రలో హామి ఇచ్చారని, ఈ పనులను అధికారంలోకి రాగానే తక్షణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అలాగే పుంగనూరులో బస్‌డిపో లేని కారణంగా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని , బస్సులను పంపి, డిపోను ఎందుకు ప్రారంభించలేని మిధున్‌రెడ్డి నిలధీశారు. కేవలం వ్యక్తి గత కక్షలతో పుంగనూరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇద్దరు పుంగనూరు అభివృద్ధిని అడ్డుకోవడం హాస్యాస్పదమన్నారు. పుంగనూరు అభివృద్ధికి కృషి చేయాల్సిన అధికార పార్టీ రాజకీయాలు చేయడం బాధకరమన్నారు. పుంగనూరు అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, వైఎస్సాఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, నాగరాజారెడ్డి, సంయుక్త కార్యదర్శి అక్కిసాని బాస్కర్‌రెడ్డి, వైఎస్సాఆర్‌సీపీ జెడ్పీప్లోర్‌లీడర్‌ వెంక టరెడ్డి యాదవ్‌, ఆర్టీసి మజ్ధూర్‌ సంఘ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మున్సిపల్‌ ఉద్యోగకార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్దిన్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

మంచినీరు అందిచడమే లక్ష్యం….
భూగర్భజలాలు అడుగంటిపోతోందని , మంచినీరు లేక ప్రజలు ఆనారోగ్యానికి గురౌతున్నారని మిధున్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరికి మంచినీరు ఉచితంగా అందజేస్తున్నట్లు మాజీ ఎంపి మిధున్‌రెడ్డి తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పుంగనూరులో అన్ని వార్డుల్లోను ఆర్‌వోఆర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే నాలుగు ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ఇందుకోసం తమ సొంత నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. మండలాల్లో కూడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా సురక్షితమైన మంచినీటిని అందజేయడమే తమ కుటుంబ ఆశయమన్నారు.

అధికారంలోకి రాగానే….
రాష్ట్రంలో వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పుంగనూరులో పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుడతామన్నారు. పరిశ్రమల ద్వారా యువకులను , ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే పట్టణంలో కౌండిన్య కాలువలను రాతి కట్టడాలతో నిర్మించి, డ్రైనేజ్‌ వ్యవస్థను క్రమబద్దీకరించి, రాబోవు తరాలకు సమస్య లేకుండ పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం సుమారు రూ.50 కోట్లతో ప్రణాళికలు సిద్దం చేసి ఉంచామన్నారు. అలాగే బీసీ బాలికల సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు.

క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం

Tags: The aim is to develop all kinds of pungenturas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *