ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే ధ్యేయం- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

రామసముద్రం ముచ్చట్లు:
 
మండలంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే ధ్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. బుధవారం స్థానిక పంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో అన్ని శాఖల అధికారులతో సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి సహకారంతో పంచాయితీని అన్ని విధాలా మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా ఉన్న వాలింటర్లు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీదే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని వాలింటర్లకు ఆయన సూచించారు. అన్ని వర్గాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్న కూడా వెనుకడుగు వేయలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైకాపా అత్యధిక స్థానాలను సాధించి అధికారంలోకి రావడం తధ్యమన్నారు. సచివాలయ సిబ్బంది, వాలింటర్లు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం శాఖల వారీగా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది మూర్తి, భారతమ్మ, ఉపేంద్ర, బత్తెమ్మ, గౌతమి, రేణుక, సుగుణమ్మ, రవి, విఆర్ఏ మహ్మద్ రఫీ, ఫిల్డ్ అసిస్టెంట్ వెంకటరమణ, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, వాలింటర్లు రేవతి, మేఘన, రెడ్డెమ్మ, శ్రావణి, పుష్పావతి, దినకర్, హరీష్, కుమారస్వామి, రామచంద్ర, ప్రదీప్, ఆశ వర్కర్లు మంజుల, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags: The aim is to make it an ideal panchayat – Sarpanch Srinivasureddy

Natyam ad