రాజకీయ స్వార్థం కోసం ఏపీని హడావుడిగా విభజించారు- ప్రధాని మోడీ

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజించిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అనేక అంశాలపై స్పందించారు.. ఇక, రాష్ట్ర విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజన సరిగ్గా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు ఉండేవి కావన్నారు.. మరోవైపు.. రాష్ట్ర విభజనకు మేం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాజకీయ స్వార్థం కోసం ఏపీని హడావుడిగా విభజించారని ఆరోపించిన మోడీ… అయితే విభజన కోసం అనుసరించిన పద్ధతి సరికాదన్నారు.. తలుపులు మూసి పేపర్ స్ప్రే కొట్టారని నాటి ఘటనలను గుర్తుచేశారు.. ఎలాంటి చర్చ జరగకుండానే విభజన బిల్లును ఆమోదించారని విమర్శించారు.. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, యూపీఏ 2 ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.. ఎన్నో దఫాలుగా అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణ.. కేంద్రం దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి.. ఇక, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ కుంటిసాకులే అంటూ రాజ్యసభలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ధ్వజమెత్తిన విషయం తెలిసిందే కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ విమర్శలు గుప్పించారు.
 
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సామరస్య పద్దతిలో జరగాల్సిందని.. కానీ కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజన బిల్లును ఆమోదించిందని ప్రధాని మోడీ అన్నారు. విభజన చట్టంపై కాంగ్రెస్ ఎలాంటి చర్చ జరపలేదు. మైకులు కట్ చేశారు. ఇదేనా ప్రజాస్వామ్య పద్దతి.? అంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.ఎలాంటి వివాదాలు లేకుండా అటల్ బిహారీ వాజ్‌పేయి మూడు రాష్ట్రాలను శాంతియుతంగా ఏర్పాటు చేశారని మోడీ గుర్తు చేశారు. ఎలాంటి వివాదం తలెత్తకుండా.. అందరూ కలిసి కూర్చుని బిల్లును పాస్ చేశారన్నారు. ఏపీ తెలంగాణ విషయంలోనూ ఇలా జరిగి ఉంటే బాగుండేదని ప్రధాని మోడీ తెలిపారు. రాష్ట్రాల ఏర్పాటుకు, తెలంగాణ‌కు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న మోడీ.. కాంగ్రెస్ అధికార గ‌ర్వం వ‌ల్ల ఇరు రాష్ట్రాలు ఇంకా సమస్యలు ఎదుర్కుంటున్నాయని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్సే కారణం అని తెలిపారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి సైతం ఎలాంటి లాభం జరగలేదు.
 
Tags; The AP has been hastily divided for political selfishness- Prime Minister Modi

Natyam ad