ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రపంచ ఖ్యాతి సాధించాలి-సీజేఐ ఎన్వీ రమణ

హైదరాబాద్ ముచ్చట్లు:
 
హైదరాబాద్ లోని  ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రపంచ ఖ్యాతి సాధించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ కేంద్రం వల్ల హైదరాబాద్కు మరింత పేరు వస్తుందన్నారు. భవన
నిర్మాణానికి గచ్చిబౌలిలో విలువైన భూమి కేటాయించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. శనివారం నాడు ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి అయన  శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ఇప్పటికే హైదరాబాద్లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కొనసాగుతున్నదని చెప్పారు.  సింగపూర్ వలే హైదరాబాద్ కేంద్రం కూడా ప్రపంచఖ్యాతి సాధించాలన్నారు.
ఏడాదిలోగా భవన నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నామని అన్నారు. ఐఏఎంసీ ప్రతిపాదనను సీఎం కేసీఆర్కు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారని, అంతే త్వరగా దానికోసం ఓ తాత్కాలిక కేంద్రాన్ని కూడా
ఏర్పాటు చేశారన్నారు. మధ్యవర్తిత్వం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయని నాతోపాటు కేసీఆర్ కూడా నమ్ముతారని చెప్పారు. నేడు ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేయడం ఎంతో సంతోషంగా
ఉందన్నారు. దీనికోసం రూ.50 కోట్లు కేటాయించారని సీజేఐ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమాకోహ్లి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంర్దశర్మ, ఐఏఎంసీ ట్రస్టీలైన స్రుపీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, సుప్రీంకోర్టు రిటైర్డున్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags: The Arbitration Center should achieve world renown-CJI NV Ramana

Natyam ad