ముచ్చింతల్ లో శ్రీవారి దివ్య క్షేత్రం ప్రారంభం

– శ్రీవారి ఆలయం నుంచి వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందించిన టీటీడీ చైర్మన్, ఈవో
 
తిరుమల ముచ్చట్లు:
 
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి నిర్మించిన 108 దివ్య క్షేత్రాల్లో ఒకటైన తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రాన్ని ఆదివారం ప్రారంభించారు. శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన వస్త్రం, తీర్థప్రసాదాలను టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామికి అందించారు. ఆయన వస్త్రాన్ని శ్రీవారి విగ్రహానికి అలంకరించారు. శాసన సభ్యులు , టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు  చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, దేవస్థానం విద్యాధికారి శ్రీ గోవింద రాజన్, సికింద్రాబాద్ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ హేమంత్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫోటో ఎగ్జిబిషన్ కు అనూహ్య స్పందన
దివ్య దేశాల ప్రాంగణంలో టీటీడీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కు సందర్శకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తిరుమల నాడు – నేడు అంశంపై శ్రీవారి ఆలయంతో పాటు పలు ప్రాంతాలు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తూ ఏర్పాటు చేసిన ఫోటోలు కళ్ళకు కట్టినట్లు ఉన్నాయని సందర్శకులు అభినందనలు తెలిపారు.

Tags: The beginning of the Srivari Divya Kshetra in Muchhinthal

Natyam ad