The big fire in the biscuits factory

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Date: 12/12/2017
హైదరాబాద్ ముచ్చట్లు:
నగరంలోని ఎల్బీనగర్ బైరామల్గూడలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బిస్కెట్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ శబ్దంతో మంటలు రావడంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. అయితే బిస్కెట్ ఫ్యాక్టరీ నివాసాల మధ్యే ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు అప్రమత్తమై అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోయారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Tag: The big fire in the biscuits factory

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *