The big rally under the BC Welfare Society in Gudduur

జి.కొండూరులో బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

-మైలవరంలో బిసి సింహగర్జనకు భారీగా తరలిన జనం

– జి.కొండూరులో ఆర్.కృష్ణయ్యకు ఘనస్వాగతం

Date : 24/12/2017

జి.కొండూరు ముచ్చట్లు:

మైలవరంలో ఆదివారం నిర్వహించిన బిసి సింహగర్జన సమావేశానికి భారీగా బిసి వర్గాల ప్రజలు తరలి వెళ్లారు. జి.కొండూరులో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు ఘనస్వాగతం పలికారు. పూలను వెదజల్లుతూ బిసి నేతలను,బిసి వర్గాల సోదరులు ఐకమత్యం చాటుతూ ముందుకు సాగారు. బిసిల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం మైలవరం తరలివెళ్లారు. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి డా.ఎన్.మారేష్, ప్రధాన కార్యదర్శి కాగిత అజయ్ కుమార్, జి.కొండూరు మండల శాఖ అధ్యక్షుడు కుక్కల శ్రీనివాస్, బీసీల్లో వివిధ కులాలకు చెందిన. నాయకులు పాల్గొన్నారు.

Tags : The big rally under the BC Welfare Society in Gudduur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *