పెద్దపంజాణిలో ఘనంగా 69 వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

Date:26/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని పెద్దపంజాణి మండలంలోని పలు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 69 వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ మురళీకృష్ణ, జెడ్పీటీసీ సులోచన తులసి మునెమ్మగుడి వద్ద గల ఉన్నత పాఠశాల, అప్పినపల్లె పాఠశాలలలో జాతీయ జెండాను ఎగురవేసి, విద్యార్థులతో జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు. తొలుత వారు దేశ నాయకులైన మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అలాగే పెద్దపంజాణి పోలీసు స్టేషనులో ఎస్సై చంద్రమోహన్, తహశీల్దారు కార్యాలయంలో సురేంద్ర బాబు, ఎంపీడీవో వెంకటరత్నం,ఎంఈవో హేమలత, సింగిల్ విండో కార్యాలయంలో సీఈఓ రామరాజు ఆద్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు జాతీయనాయకులైన మహాత్మ గాందీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వంటి మహనీయుల సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటిసీ మధులత, సర్పంచ్ సురేష్ బాబు, తెదేపా నాయకులు రోజాక్రిష్ణారెడ్డి, చెంగారెడ్డి, మురహరిరెడ్డి, రామకృష్ణ, సుధాకర్ రెడ్డి, భానుప్రతాప్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:The biggest celebration of the 69th Solid Day celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *