అధికారుల కళ్ళకు గంతలు-రెచ్చి పోయిన మట్టి మాఫియా

-సుమారు 600 ట్రక్కుల గంగమట్టి లూటీ…!!
 
విజయవాడ ముచ్చట్లు:
 
పేద వాడు తన ఇంటి అవసరాల నిమిత్తం ట్రకు మట్టిని తాకితే.. వాహనాలను సీజ్ చేసి చట్టం.. చర్యలు అంటూ ఇబ్బందులు పెట్టే అధికార యంత్రాంగం శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజామున వరకు కళ్ళకు గంతలు కట్టుకుంది..దాంతో మట్టి మాఫియా రెచ్చి పోయింది..ఒకటా.. రెండా ఏకంగా 15 ట్రాక్టర్లను గంగ కాలువపై మళ్లించి రెండు జేసీబీ వాహనాల తో గంగమట్టిని లూటీ చేసింది.ఎవరు అడిగితే వారికి.. మట్టి మనదే.. అంటూ ట్రాక్టర్ మట్టి రూ.900 చొప్పున అమ్ముకున్నారు.శనివారం రాత్రి బీటు పోలీసులు.. రెవెన్యూ సిబ్బంది.. గంగ అధికారులు ఈ అక్రమ మట్టి రవాణా ను చూస్తూ ఉండిపోవడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గంగకాలువ కు గండి పడితే.. ఈ మట్టిని వాడుకోవడానికి నిల్వ ఉంచారు.. ప్రస్తుతం మట్టి మాఫీయా కు నేడు సిరులు కురిపిస్తోంది.మట్టి మాఫియా లో కొందరు పెద్ద పాత్ర ఉంది దాంతో వారు మాకు అందరూ తెలుసు..కలెక్టర్.. ఆర్డీవో.. స్థానిక ప్రజాప్రతినిధులు అండదడలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం తో అధికారులను మభ్య పెట్టి ఈ అక్రమ రవాణా సాగిస్తూ ఉన్నారని సమాచారం.మట్టి తవ్వకాలకు వాడిన జేసీబీ యంత్రాలను గుర్తించి కేసులు పెట్టడం లో గతంలో నిర్లక్ష్యం ఉండి పోవడంతో నేడు ఆ జేసీబీ వాహనాలు తెలుగు గంగ కాలువల పై పరుగులు పెడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: The blindfolded-provoked mud mafia in the eyes of the authorities

Natyam ad