యువకుడి దారుణ హత్య

గుంటూరు ముచ్చట్లు:
 
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం శివ ప్రియ నగర్ వద్ద ఓ యువకుడిని హత్య చేసి మురుగు కాలువ పక్కన పడవేసిన సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. చిలకలూరిపేట పట్టణం రూత్ డైక్ మెన్ కాలనీకి చెందిన ప్రతాప్ కిల్లయ్య (35) పందులు మేపు కుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో  మంగళవారం ఉదయం ఇంటి నుంచి వచ్చిన కిల్లయ్య రాత్రి కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. పందులు ఉంచే ప్రాంతానికి దగ్గరలోనే కిల్లయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. కిల్లయ్య శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు సిఐ తెలిపారు. హత్య చేసి కొంతదూరం లాక్కొచ్చి మురుగు కాలువ పక్కన  పడవేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన చిలకలూరిపేట రూరల్ సిఐ ఎం సుబ్బారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
 
Tags: The brutal murder of a young man

Natyam ad