గూడురులో కిరాతకంగా సోదరుల హత్య

Date: 11/12/2017
నెల్లూరు ముచ్చట్లు:
జిల్లాలో గూడూరు ఇంద్రనగర్లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. పథకం ప్రకారం కాపు కాసిన దుండగులు కత్తులతో గొంతులు కోసి ఇద్దర్ని అతి కిరాతకంగా చంపారు. మృతులు చిన్న జయరామయ్య, పెద్ద జయరామయ్య అని తెలిసింది. మృతులు సోదరులు కావడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పథకం ప్రకారం హత్య చేయగానే దుండగులు ఘటనా స్థలి నుంచి పరారయ్యారు. ఐతే చంపింది ప్రత్యర్థులేనా? లేకుంటే ఎవరైనా డబ్బుల కోసం చంపారా? అసలెందుకు చంపాల్సి వచ్చింది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి అప్రమత్తం చేశారు. జిల్లా దాటి వెళ్లకుముందే దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Tag: The brutal murder of brothers in the nest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *