The bus bounces ... two serious injuries

బస్సు బోల్తా…ఇద్దరికి తీవ్ర గాయాలు

Date:25/09/2018

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా పూలకుంట దగ్గర ప్రైవేట్ టౌన్ సర్వీస్ బస్సు బోల్తా  పడింది.  ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్రవ గాయాలయ్యాయి. మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 25 మంది వున్నారు. బస్సుకి స్టెరింగ్ విరిగి పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.  క్షతగాత్రులను అందరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే  ఆసుపత్రిలో  డాక్టర్ల సమ్మె కారణంగా సకాలంలో వైద్యం అందలేదు. దాంతో బంధువులు అందోళనకు దిగారు. సీరియస్ గా ఉన్న  వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  బస్సు ఓనర్ తో  బాధితులు,  గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ఆర్టీయే అధికారులు  కండిషన్ లేని వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని బాధితులు నినాదాలు చేసారు.

తెరాసకు కాంగ్రెస్‌ తేడా ఏమీ లేదు: బండారు దత్తాత్రేయ

Tags:The bus bounces … two serious injuries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *