మంటలు చెలరేగి బస్సు దగ్దం.

ఒంగోలు ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక వుడ్ కాంప్లెక్స్ సమీపంలోని పార్కింగ్ స్టాండ్ లో నిలిపి ఉన్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మిగతా బస్సులను అక్కడి నుంచి తరలించారు. పార్కింగ్ స్టాండ్ లో సుమారు 20కి పైగా బస్సులు ఉండటంతో ఎక్కువ సంఖ్యలో బస్సులకు నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటల ధాటికి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
Tags:The bus caught fire and burned.

Natyam ad