బస్సు బోల్తా..ప్రయాణికులు సురక్షితం

అనంతపురం ముచ్చట్లు:
 
అనంతపురంలో అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులెవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇద్దరు మగ్గురికి మాత్రమే గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం శింగనమల మండల పరిధిలోని సోదనపల్లి గ్రామం మలుపు వద్ద బస్సు రాగానే స్టీరింగ్‌ పనిచేయకపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 21 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు ముగ్గురికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఉన్నా టెట్‌ వాహనంలో శింగనమల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags; The bus overturned and the passengers were safe

Natyam ad