హార్సిలీ కొండలో కారు దగ్ధం

Date:20/01/2018

బి.కొత్తకోట ముచ్చట్లు:

కడప పట్టణానికి చెందిన మహమ్మద్‌గౌస్‌ తన కుటుంబ సభ్యులతో కలసి మధ్యాహ్నం హ్రార్సిల్లీ కొండపైకి బయలుదేరారు. కారులో మహమ్మద్‌గౌస్‌, ఆరు మంది చిన్నపిల్లలు, నలుగు పెద్దలు ఉన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కారు కొండ మధ్యలోకి వచ్చింది. ఈ సందర్భంగా సైలెన్‌సర్‌ నుంచి పొగ రావడంతో మహమ్మద్‌గౌస్‌ అప్రమత్తమై కారును నిలిపి పరిశీలించారు. మంటలు వ్యాపించే ప్రమాదాన్ని పసిగట్టిన మహమ్మద్‌గౌస్‌ కారులోని పిల్లలను, పెద్దలను బయటకు దించారు. తరువాత క్షణాల్లో కారు దగ్ధమై, బూడిదైంది. పొగరావడాన్ని గుర్తించకుండ ఉంటే కారు వెహోత్తం కాలిపోయి, ఊహించని ప్రమాదం జరిగేది. గౌస్‌ కుటుంబ సభ్యులు ఒక్క సారిగా ఆందోళన చెందారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

Tags : The car in the Horsley hill is dead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *