The car is near the house of the CM

సీఎం నివాసానికి సమీపంలో కారు దగ్ధం

అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసానికి అతి సమీపంలో శుక్రవారం ఓ కారు దగ్ధమైంది. కర్ణాటక రిజిస్ట్రేషన్కు చెందిన మహీంద్రా ఎక్స్ఏవీ కారు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కారులోని వారంతా దిగి దూరంగా పరుగెట్టారు. డీజిల్ ట్యాంక్లోకి మంటలు వ్యాపించడంతో పోలీసులు దాని సమీపంలోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. కారు ఏ క్షణాన పేలుతుందోనని అగ్నిమాపక సిబ్బంది కూడా దూరం నుంచి నీళ్లు చల్లారు. మంటల వేడిమికి కారు అద్దాలు భారీ శబ్దం చేసుకుంటూ పేలాయి. ముఖ్యమంత్రి నివాసానికి అతి సమీపంలో ఈ ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది అన్ని కోణాల్లోనూ విచారణ ముమ్మరం చేశారు.
 Tag : The car is near the house of the CM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *