Date:15/04/2018
తిరుమల ముచ్చట్లు :
-నన్నపనేని రాజకుమారి

మానవత్వం మరచి మృగాల కంటే హీనంగా మహిళలను హింసిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఏపి మహిళ కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేసారు..శ్రీవారి దర్శనార్థం కుటుంబసభ్యులతో కలసి తిరుమల కొండపైకి వచ్చిన ఆమె, ఈ ఉదయం విఐపీ బ్రేక్ లో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు, అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించారు…యూపీ, కాశ్మీర్ లో జరిగిన తాజా దుర్గాటనలో ఒక బిజేపి ఎమ్మెల్యే పాత్ర ఉందని తేలడం చాలా బాధకారం, తల్లి, చెల్లి, బిడ్డ అన్న తేడా లేకుండా పైశాచికంగా అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న వారి ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు…ఓవైపు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తూ, మరోవైపు కేంద్రానికి న్యాయం చేయండని మోదీ దీక్ష చేయడం దుర్మార్గమని నన్నపనేని మండిపడ్డారు…
– మంత్రి కొల్లు రవీంద్ర

కేంద్రం మొండివైఖిరి విడిచిపెట్టి విభజన హామీలను అమలు చేసి ఏపికి న్యాయం చేసేలా బుద్ధి ప్రసాదించమని మంత్రి కొల్లురవీంద్ర వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు…ఉదయం విఐపీ బ్రేక్ లో కుటుంబంతో కలసి ఆలయంలోకి వెళ్లిన మంత్రి గర్భగుడిలోని మూలవిరాట్టును దర్శించుకొని ఆశీస్సులు పొందారు, ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు..రాష్ట్రాభివృద్ధి కోసం నిస్వార్థంగా కష్టపడుతున్న చంద్రబాబుకి మరింత శక్తిని ప్రసాదించమని, అలాగే ప్రజలందరు సుఖసంతోషాలతో జీవించేలా కరుణించమని భగవంతుడిని వేడుకున్నట్లు కొల్లురవీంద్ర అన్నారు.
Tags:The celebrities who visited Tirumala Sriwari