కేంద్ర బడ్జెట్ గంటన్నర.. కేసీఆర్ తిట్ల పురాణం రెండున్నర గంటలు

– టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యెద్దేవా
 
న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
కేంద్ర బడ్జెట్ గంటన్నర ఉంటే కేసీఆర్ రెండున్నర గంటలు ఏక పత్రాభినయం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యెద్దేవా చేశారు. కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారని వ్యాఖ్యానించారు. విభజన చట్టం అంశాలు, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ యూనిట్, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల విషయం ఏదీ మాట్లాడలేదన్నారు. మోడీపై యుద్ధం ప్రకటిస్తారని ఆశించినట్లు తెలిపారు. నిర్మలా సీతారామన్, మోడీ గురించి నీచంగా, జుగుప్సాకరంగా కేసీఆర్ మాట్లాడారన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మాట్లాడారని అన్నారు. భూస్వాములు, అగ్ర వర్ణాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ మాటలను కేసీఆర్ మాట్లాడినట్లు ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉందన టీపీసీసీ చీఫ్… రాజ్యాంగ సవరణ ద్వారా దళితులు, బలహీన వర్గాలకు మేలు చేసే ప్రయత్నం చేయాలని సూచించారు. రాజ్యాంగం మార్చలన్నది బీజేపీ కుట్ర… బీజేపీ కుట్రకు కేసీఆర్ వంత పాడారని విమర్శించారు. రాజ్యాంగం రద్దు చేయాలని బీజేపీ ఎన్నో ఏళ్లుగా కుట్ర చేస్తోందన్నారు. కేసీఆర్‌ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని తెరమీడికి తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాజ్యాంగం రద్దు కుట్రకు కేసీఆర్ మద్దతు తెలిపారని  ఆయన ఆరోపించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్దం చేయాలని పిలుపునిచ్చారు.
 
 
 
కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకునేందుకు రెండు రోజుల పాటు గాంధీ భవన్‌లో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకొకపోతే దేశ యువత కేసీఆర్ నాలుక కొస్తారని రేవంత్ హెచ్చరించారు. యూపీలో బీజేపీని గెలిపించాలన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ అసదుద్దీన్ ఒవైసీ సూపరి గ్యాంగ్ అని వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి సుపారి తీసుకున్నారని తెలిపారు.ఓట్లు చీల్చడానికి ఎంఐఎం పోటీ చేస్తుందని మండిపడ్డారు. మోడీ గెలవడం, రాజ్యాంగం రద్దు ఇవే ప్రధాన అంశాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసభ్యకరమైన భాష మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్ భాషను ఖండిస్తున్నామన్నారు. సిద్ధాంత పరంగా బీజేపీని వ్యతిరేసిస్తాం కానీ… కేసీఆర్ భాషను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడితే తెలంగాణ పరువు ఎం కావాలని ఆయన  ప్రశ్నించారు. మహిళలను గౌరవించే సంస్కృతి భారత సంస్కృతి అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ భాషను సభ్య సమాజం క్షమించదన్నారు. కేసీఆర్ భాష ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్‌తోనే అని రేవంత్ తెలిపారు.
 
Tags: The central budget is an hour and a half .. The myth of KCR swearing is two and a half hours

Natyam ad