The Chief Guest is attending the 2nd Joint Collector Chandramauli

ముఖ్య అతిథి గా 2 వ జాయింట్ కలెక్టర్ చంద్రమౌళి హాజరు

Date : 04/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండల పరిధిలోని అప్పినపల్లె,శ్రీరామాపురం గ్రామాల్లో జరిగిన5 వ విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా 2 వ జాయింట్ కలెక్టర్ చంద్రమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అందరిచేత జన్మభూమి ప్రతిజ్ఞ చేయించి గ్రామసభలను మొదలుపెట్టారు. మండల ఎంపీపీ మురళీకృష్ణ, జెడ్పీటీసీ సులోచన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిపారు. తెదేపా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికోసం, మహిళ రక్షణ, యువతకు ఉపాధి కల్పన, పింఛనులు, రైతులకు వడ్డీ లేనిరుణాలు,సబ్సిడీ పై వ్యవసాయ పరికరాల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అనంతరం ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ సుమిత్ర,నాయకులు శ్రీరాములు, మరుగుదొడ్ల ఆవశ్యకతను తెలిపే ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. మండల విద్యాధికారిణి హేమలత ఆద్వర్యంలో శ్రీరామాపురం పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులతో మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాల శుభ్రత కార్యక్రమాన్ని తెలిపే బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సురేంద్ర, ఎంపీడీఓ వెంకటరత్నం, స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags : The Chief Guest is attending the 2nd Joint Collector Chandramauli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *