నిర్మాణం చేశారు… ప్రారంభం మరిచారు

వరంగల్ ముచ్చట్లు:
 
కోట్ల రూపాయల వ్యయంతో అన్ని హంగులతో నిర్మించిన గ్రంథాలయం ప్రారంభానికి నోచుకోలేదు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం శిథిలావస్థ ఉన్న అందులోనే కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో ఫర్నిచర్ లేక, టాయిలెట్స్ అందుబాటులో  లేక  పాఠకులు, ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న బిల్డింగ్ పక్కనే ఉన్నా.. పాత భవనంలోనే గ్రంథాలయం కొనసాగించడంతో పాఠకులు నిరాశ చెందుతున్నారు.కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం కేవలం అలంకారప్రాయంగా మారింది. పాఠకులకు, వివిధ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు రోడ్డు పక్కనే ఉన్న పాత భవనంలో చదువుకోవడంతో వారికి  పట్ల  వాహనాల శబ్దం తో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా గ్రంథాలయ భవనం పూర్తయ్యి ఏడాది దాటుతున్న నేటికీ ప్రారంభించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం పై సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలకు తావిస్తోంది.నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు ఉన్న పాత  భవనంలో సరిపడా ఫర్నిచర్ లేదు. ఇక్కడ ప్రిపేర్ కాలేకపోతున్నాం. విపరీతమైన ధ్వని చప్పుళ్ళు వల్ల ఏకాగ్రత ఉండటం లేదు. ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. నూతన భవనం పూర్తి అయినప్పటికీ   ఓపెన్ చేయడం లేదు. చాలా మంది అసౌకర్యాలతో గ్రంథాలయాలకు రాలేకపోతున్నారు.నేను ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రిపరేషన్ అవుతున్నాను. జిల్లా గ్రంథాలయంలో సమస్యలు వెంటాడుతున్నాయి. మహిళలకు టాయిలెట్స్  లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు జిల్లా గ్రంథాలయానికి రావాలంటే జంకుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన జిల్లా గ్రంథాలయం వెంటనే ప్రారంభించాలి.
 
Tags:The construction was done … the start was beaten

Natyam ad