The creator of radiotherapy rays ... Wilhelm Conrad Röntgen

రేడియో థెరఫీ కిరణాల సృష్టికర్త… విల్హేల్మ్‌ కన్రాడ్‌ రాంట్జెన్‌

Date: 04/01/2018

ఢీల్లీ ముచ్చట్లు:

ప్రపంచంలోనే వైద్యరంగంలో రోగనిర్దారణకు (రేడియోగ్రఫీ), రోగ నిర్మూలనకు (రేడియో థెరఫీ) కోసం ఉపయోగించే ఎక్స్‌ కిరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విల్హేల్మ్‌ కన్రాడ్‌ రాంట్జెన్‌. ఈయన కనుగొనే ఎక్స్‌ కిరణాలు వైద్యరంగలములోనె కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి.విల్హేల్మ్‌ కన్రాడ్‌ రాంట్జెన్‌ (మర్చి 27,1845 – ఫిబ్రవరి 10,1923) జర్మన్‌ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. 1895 నవంబర్‌ 8న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యలుల అవధులలో గల ఎక్స్‌- కిరణాలను కనుగున్నాడు. ఈ పరిశోధన వల్ల 1991లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్‌ బహుమతి పొందారు. ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టికలో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్‌ జీనియమ్‌ అనిపేరు పెట్టి గౌరవించారు. రాయింట్జన్‌ మార్చి 27, 1845న జర్మనీలోని లెన్నెస్‌లో జన్మించాడు. ఈయన తండ్రి ఒక రైతు. తల్లి ఒక డచ్‌ మహిళ. హాలెండ్‌లో విద్యాభ్యాసం జరిగింది.1865లో యుట్రెచ్‌ యూనివర్సిటీలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ, జూరిచ్‌లోని ఫెడెరల్‌ పాలిటెక్నిక్‌ సంస్థలో చేరి పరీక్షలను ఉత్తీర్ణుడయ్యాడు. అచట మెకానికల్‌ ఇంజనీరుగా చేరాడు. 1869లో తత్వశాస్త్రంలో జూరిచ్‌ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పట్టాను పొందాడు. ఆ విశ్వవిద్యాలయంలో ప్రముఖ ప్రొపెసర్‌ అయిన ఆగస్ట్‌ కుండ్త్‌ ప్రియమైన శిష్యుడయ్యాడు. 1874లో స్టాన్‌ ఫర్డు విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా నియమించబడ్డాడు. 1875లో హోహెనీం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా నియమించబడ్డాడు. తర్వాత 1876లో స్టాన్‌ ఫర్డు విశ్వవిద్యలయంలో మళ్లీ అధ్యాపకునిగా చేరాదు. 1888లో గీసన్‌ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరాడు. తర్వాత వుర్జ్‌ బర్గ్‌ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగంలో చేరారు. 1900లో ప్రభుత్వ అభ్యర్థన మేరకు మంచ్‌ యూనివర్సిటీలో చేరారు. ఆయన కుటుంబం యు.ఎస్‌.ఎకు వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అపుడు న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ వారు అవకాశం ఇచ్చినప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా తన శేషజీవితాన్ని మునిచ్‌ నందే గడిపారు. 1895 వరకు ఉత్సర్గనాళ ప్రయోగాలలో హెర్ట్జ్‌, జాన్‌ హిటార్ఫ్‌, విలియం క్రూక్స్‌, టెస్లా, లీనార్డోలతో పనిచేశారు. ఎక్స్‌ కిరణాలను రాయింట్‌ జన్‌ కిరణాలని అందురు. కాని రాయింట్‌ జనే స్వయంగా వాటిని ఎక్జ్‌ కిరణాలని పిలిచాడు. ఈ కిరణాలను కనుగొని లోకానికి పరోపకారం చేసినందుకు కృతజ్ఞతగా ఈయనకు 1901లో భౌతిక శాస్త్రం తరపున నోబెల్‌ బహుమతి లభ్యమయింది. ఈ ఎక్స్‌ రే వెనుక ఎంతో ఆసక్తి కరమైన కథ ఉంది. రాయింట్‌ జన్‌ కేథోడ్‌ రే ట్యూబ్‌ (శూన్య గాజు నాళం)తో పరిశోధనలు చేసేవాడు. గది అంతా చీకటిగా ఉన్నప్పుడు ఈ ట్యూబ్‌ గుండా కాంతి కిరణాలను పంపడం జరిగింది. పైగా ట్యూబ్‌ చుట్టూ నల్లని కాగితాన్ని కాంతి కిరణాలు ఏ కొంచెం కూడా వెలువడకుండా కప్పి ఉంచాడు. ఇలా చేసినప్పటికి కాథోడ్‌ ట్యూబ్‌కు సమీపంలో ఉన్న బేరియం ప్లాటినో సైనైడ్‌ స్ఫటికం వింత మెరుపులతో ప్రకాశించ సాగింది. నల్లటి కాగితాన్ని కప్పి ఉంచినప్పటికీ కాథోడ్‌ ట్యూబ్‌ నుంచి ఏవో అజ్ఞాత కిరణాలు వెలువడి బేరియం ప్లాటినో సైనైడ్‌ స్ఫటికం మీద పడి అది మెరిసేటట్లు చేసిందని యీయన ఊహించగలిగాడు. ఈ కిరణాలను కాగితం గుండా, చెక్క గుండా, లోహపు పలకల గుండా ప్రయాణం చేయగలవని యీయన కనుగొన్నాడు. ఈ కిరణాలు కూడా ఓ రకమైన కాంతి కిరణాలే అని అయితే వీటి తరంగ దైర్ఘ్యం చాలా తక్కువ కావటం వల్ల మనుషుల కళ్ళకు కనిపించవని రాయింట్జన్‌ వెల్లడించాడు. మామూలు కాంతి కిరణాలే ఫోటోగ్రాఫిక్‌ ప్లేట్ల మీద ప్రభావం చూపుతూ ఉండగా, ఈ కిరణాలు మాత్రం చూపకుండా ఉంటాయా అనే ఆలోచన రాయింట్‌ జెన్‌ కి రావటం – శాస్త్ర ప్రపంలో ఒక సరికొత్త అధ్యాయానికే కారణభూతమైనది. ప్రయోగం చేయటం కోసం రాయింట్‌ జన్‌ ఫోటో గ్రాఫిక్‌ ప్లేటు మీద తన భార్య చేతిని ఉంచి ఈ కిరణాలను ప్రసారం చేసి ఫోటోను డెవలప్‌ చేసి చూసి ఆశ్చర్యపోయాడు. చేతి ఎముకలు ఉంగరంతో సహా ఆ ఫోటోలో వచ్చింది. చుట్టూ మాంసం ఉన్నట్లు మసక మసకగా ఉంది. అంటే సజీవంగా ఉన్న మనిషి కంకాళాన్ని ఈ కిరణాల ద్వారా ఫోటో తీయవచ్చని స్పష్టంగా తేలింది. దురదృష్ట వశాత్తు రాయింట్‌ జన్‌, ఆయనతో కలిసి పనిచేసిన మరో ఇద్దరు పరిశోధకులు ఈ ఎక్స్‌ కిరణాల తాకిడికే క్రమ క్రమంగా మరణించారు. ఈ ఎక్స్‌-కిరణాల వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతున్నప్పటికీ వాటిని మితిమీరి వాడితే మాత్రం ప్రమాదం తప్పదు. ఈ కారణంగానే ఎక్స్‌-కిరణాలను నిరంతరం గురి కాబట్టే రాయింట్‌ జన్‌ ఆ కిరణాల ప్రభావంగానే చనిపోయాడని తెలుస్తోంది. రాంట్‌ జెన్‌ అన్నా బెర్తా లుడ్వింగ్‌ను వివాహం చేసుకున్నాడు. అతడు 1887లో 6 సంవత్సరాల జోసెఫిన్‌ బెర్తా లుడ్వింగ్‌ను దత్తత తీసుకున్నాడు. ఈ పాప ఆయన భార్య అన్న సోదరుని కుమార్తె. రాయింట్‌ జెన్‌ ఫిబ్రవరి 10, 1923లో చిన్నప్రేవులలో కురుపు కారణంగా మరిణించాడు. ఈ వ్యాధి కూడా ఆయన చేస్తున్న రేడియో ధార్మికత ప్రయోగాల వల్ల అని విశ్వసించేవాడు కాదు. ఎందుకంటే ఈయన ఈ రంగంలో రేడియోధార్మికత నుండి రక్షించుకొనుటకు సీసపు కవచాలు వాడే కొద్దిమంది మార్గ నిర్దేశకులో ఒకరు. రాంత్‌ జెన్‌ ఆయన చేసిన ఆవిష్కరణలకు పేటెంట్‌ హక్కులు కూడా తీసుకోలేదు. నోబెల్‌ బహుమతిగా వచ్చిన ధనాన్ని వర్జ్‌ బర్గ్‌ విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం వల్ల రాంట్‌ జెన్‌ దివాళా తీశాడు. తన శేష జీతితాన్ని మునిచ్‌కి సమీపంలో గల విల్‌ హెల్మ్‌లోని ఇంటిలో గడిపాడు. ఆయన కోరిక ప్రకారం ఆయన వ్యక్తిగత, శాస్త్రానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆయన మరణం తర్వాత నాశనం చేయటం జరిగినది. 1901లో రాంట్‌జెన్‌కు మొదటి భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి వచ్చింది. ఈ బహుమతి ఆయన ఎక్స్‌ కిరణాలు కనుగొని విశేష సేవలందించినందుకు గాను యివ్వబడింది. కానీ రాంట్‌ జెన్‌ ఆ బహుమతికి వచ్చిన ఆర్థిక ప్రతిఫలాన్ని తన విశ్వవిద్యాలయానికి దానమిచ్చాడు. పియరీ క్యూరీ వలే రాంట్‌ జన్‌ తన పరిశోధనకు పేటెంట్‌ హక్కులను తిరస్కరించాడు. ఎందువలనంటే మానవాళికి తన పరిశోధన ఫలితాలు ఉపయోగకరంగా ఉండాలని. ఈ కిరణాలకు తన పేరు కూడా పెట్టరాదని కోరుకున్నాడు.

Tags: The creator of radiotherapy rays … Wilhelm Conrad Röntgen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *