The death of two students who did not get a watch

ఆచూకి లభించని ఇద్దరు విద్యార్థుల మరణం

– శవాలు వెలికితీత
– కళాశాలలో ఏం జరిగింది..?

Date:17/06/2018

పుంగనూరు ముచ్చట్లు:

ఉన్నత భవిష్యత్తు కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థుల ఆకస్మిక మరణం వెనుక వాస్తవాలు తెలియక తల్లిదండ్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దహనం కాబడిన శవాలను వెలికితీసి , పోస్టుమార్టం నిర్వహించారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు శ్రీకారం చుట్టారు. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు పట్టణంలోని తాటిమాకులపాళ్యెంలో నివాసం ఉన్న మదుసూధనాచారి, పద్మజ దంపతులకు మహేష్‌ (20) అనే కుమారుడు ఉన్నారు. ఇలా ఉండగా మహేష్‌ మార్కాపురంలో ఎస్‌ఎస్‌ వ్యవసాయ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మహేష్‌కు వివేక్‌చంద్ర అనే సహచర విద్యార్థి స్నేహితుడైయ్యాడు. ఇలా ఉండగా ఆకస్మాత్తుగా మధుసూధనాచారి దంపతులకు కుమారుడి మరణవార్త అందింది. మృతికి వివరాలు తెలియకపోవడంతో తల్లిదండ్రులు నిస్సాహాయ స్థితిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు మహేష్‌ స్నేహితుడు వివేక్‌చంద్ర హాజరైయ్యాడు. వీరికి ఏం జరిగిందో తెలియదు కానీ ఆకస్మాత్తుగా వివేక్‌చంద్ర కూడ కళాశాలలో మరణించాడు. ఈ విషయాలను యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండ వివేక్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించి, అంత్యక్రియలు కానిచ్చేశారు. ఈ రెండు సంఘటన లు ఇద్దరి స్నేహితుల కుటుంబాలను కలచివేసింది. మహేష్‌ తల్లికి అనుమానం వచ్చి, మార్కాపురం కళాశాలకు వెళ్లి విషయాలను సేకరించి, డిఎస్పీ రామాంజనేయులకు ఫిర్యాదు చేసి, కుమారుడి మృతిపై విచారణ చేపట్టాలని డిమాండు చేసింది. డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, పుంగనూరుకు చేరుకున్నారు. మహేష్‌ శవానికి స్మశాన వాటికలో పోస్టుమార్టం నిర్వహించారు. నివేదికలు తీసుకుని వివేక్‌చంద్ర గ్రామానికి వెళ్లి వివేక్‌చంద్ర శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇద్దరి స్నేహితుల మరణం వెనుక కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు ఆకస్మాత్తుగా మూడురోజుల గడువులో చనిపోవడం, మృతికి కారణాలు తెలియకపోవడంతో ఎస్‌ఎస్‌ కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు లోనౌతున్నారు. ఈ విషయమై దర్యాప్తు చేసి, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని డిఎస్పీ రామాంజనేయులు హామి ఇచ్చారు.

Tags; The death of two students who did not get a watch

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *