The development of the poor is a goal

పేదల అభివృద్ధే తెదేపా లక్ష్యం

– జెడ్పీటీసీ సులోచన

Date : 06/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు :

నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పేదల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం పనిచేస్తోందని జెడ్పీటీసీ సులోచన అన్నారు. 5 వ విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో భాగంగా ముత్ఉకూరు, లింగాపురం గ్రామాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రతిఒక్కరూ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం నోడల్ అధికారి కేశవ రామిరెడ్డి ముత్తుకూరు హరిజనవాడలోని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. అలాగే హరిజనవాడకు చెందిన రఘు అనే వ్యక్తి కి రైతురథాన్ని జెడ్పీటీసీ అందజేశారు. లింగాపురం గ్రామం ప్రాథమిక పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని, చిన్నారులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఇందిరమ్మ, పార్వతమ్మ, ఎంపీటీసి వెంకటప్ప, టీడీపీ మండలాధ్యక్షుడు శ్రీరాములు, నాయకులు రామక్రిష్ణ, సుధాకర్ రెడ్డి, మురహరి రెడ్డి, భానుప్రతాప్ రెడ్డి, గంగప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags : The development of the poor is a goal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *