ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కు స్టీఫెన్ కు వ్యత్యాసం

Date:14/03/2018
ముంబై ముచ్చట్లు:
ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1879 మార్చి 14న జర్మనీ దేశంలోని వుర్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్మ్ ప్రాంతంలో జన్మించారు. వంకర టింకర తలతో పుట్టిన అతనిని చూసి తల్లిదండ్రులు నిరాశ చెందారు. డిగ్రీ పూర్తయ్యాక ఐన్ స్టీన్ కోసం ఉద్యోగం వెతికిపెట్టేందుకు అతని తండ్రి చాలా కష్టపడ్డారు. తన మీద పెద్దగా నమ్మకం లేని ఐన్స్టీన్ సైతం చిన్న ఉద్యోగం వస్తే చాలని అనుకున్నాడు.అప్పట్లో న్యూటనియన్ మెకానిక్స్ కాన్సెప్ట్ సంబంధించి ఎక్కువ రోజులు భవిష్యత్తు ఉండదని ఐన్స్టీన్ గమనించారు. ఇదే ఆయన్ను ప్రత్యేకమైన కొత్త సిద్దాంతం దిశగా నడిపించింది. ఆ విధంగా ఆయన స్విస్ పేటెంట్ కార్యాలయంలో సాపేక్ష సిద్దాంతం కోసం రిజిస్టర్ చేసేలా చేసింది, మొత్తానికి చరిత్రలోనే గుర్తుంచుకునే విధంగా 1902లో స్విట్జర్లాండ్ బెర్న్ నగరానికి వెళ్లి స్నేహితుని సాయంతో స్విస్ పేటెంట్ కార్యాలయంలో క్లర్క్గా జాయిన్ అయ్యాడు.జర్మనీ పౌరసత్వాన్ని వదులుకుని స్విట్జర్లాండ్లో స్థిరపడాలని నిర్ణయానికి వచ్చాడు. అక్కడే అతని జీవితం సరికొత్త మలుపు తిరిగింది. ఆయన పనిచేస్తున్న కార్యాలయం శాస్త్రవేత్తల పేటెంట్ హక్కులను నమోదు చేస్తుంది. ఆ విధంగా ఐన్ స్టీన్ సైతం ఎన్నో పేటెంట్లను పొందాడు.శక్తి రంగంలోనే కీలక అంశమైన మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టారు. క్వాంటం థియరీ పరిణామ క్రమం, సాపేక్ష సిద్ధాంతం, ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లా, అణుబాంబు వంటి ఎన్నో ఆవిష్కరణలను కనుగొన్నారు.1903 లో ఐన్ స్టీన్ మిలెవా మారిక్ ను పెళ్ళి చేసుకున్నారు. వారు కొంత కాలం బాగానే ఉన్నా ఆ తర్వాత పగలు రాత్రి తేడా లేకుండా పిచ్చిగీతలు గీస్తూ కూర్చునే భర్తతో ఎలాంటి అచ్చట్లు, ముచ్చట్లు తీరవని ఆమెకు త్వరలోనే అర్ధం అయింది. ఐన్ స్టీన్ ఖాళీ లేకుండా దేశవిదేశాలకు తిరుగుతూ బిజీగా ఉన్నాడు. దీన్తో అతని భార్య ఐన్ స్టీన్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పరిస్థితిలో ఐన్ స్టీన్ బుర్రలో ఐడియాలు తప్ప జేబులో చిల్లిగవ్వ లేదు.తనకు త్వరలోనే నోబుల్ ప్రైజ్ వస్తుందని ఆ డబ్బు అంతా భార్యకు ఇస్తానని మాట ఇచ్చాడు. ఐన్ స్టీన్ కి 1922 లో నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతితో వచ్చిన డబ్బును తన మొదటి భార్యకు ఇచ్చేసాడు. అప్పటికే మిలెవా మారిక్ కు విడాకులు ఇచ్చిన ఐన్ స్టీన్, తన కజిన్ ఎల్సా లోవెంథాల్ ను వివాహం చేసుకున్నారు. ఐన్ స్టీన్ ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ మనకు ఎన్నో విషయాలను తెలియయజేసాడు. ఐన్ స్టీన్ మరణించాక అయన మెదడును తీసి భద్రపరిచారు. ఇప్పటికి దాని మీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.
Tags: The difference between Stephen and Albert Einstein

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *