జిల్లాల విభజన సహేతుకంగా లేదు-ఎమ్మెల్యే ఆనం

నెల్లూరు ముచ్చట్లు:
 
జిల్లాల విభజనపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాల విభజన కొన్నిచోట్ల సహేతుకంగా లేదన్నారు. వెంకటగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను బాలాజీ జిల్లాలో కలపడం సరికాదని వ్యాఖ్యానించారు.గతంలో నియోజకవర్గ కేంద్రంగా రాపూరు ఉందని ఆనం రాంనారాయణరెడ్డి గుర్తు చేశారు. రాపూరును వెంకటగిరిలో విలీనం చేసి నష్టపరిచారని.. ఇప్పుడు నెల్లూరు కాకుండా బాలాజీ జిల్లాలో కలుపుతున్నారని వ్యాఖ్యానించారు. తాము చేసిన తీర్మానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ను కలిశానని చెప్పారు. వెంకటగిరి ఏ జిల్లాలో ఉండాలని పుర, గ్రామీణ ప్రతినిధులతో మాట్లాడానని.. మరో 2 మండలాల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు.
 
Tags; The division of districts is not reasonable-MLA Anam

Natyam ad