నెల్లూరు జిల్లా విభజన అర్ధ రహితం

నెల్లూరు జిల్లా పరిరక్షణ సమితి
ఆత్మకూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా విభజన అర్థరహితమని నెల్లూరు జిల్లా పరిరక్షణ సమితి పేర్కొంది. నెల్లూరు జిల్లా పరిధిలోని సోమశిల ప్రాంతంలో ఉన్న సోమశిల జలాశయంను పరిశీలించి తద్వారా తమ మనోభావాలను మీడియాకు వ్యక్తపరిచారు.13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  26 జిల్లాలు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. లోకసభ నియోజకవర్గాల ప్రాతిపదికన ఏకపక్షంగా జిల్లాల పునర్విభజన అర్థరహితమని నెల్లూరు జిల్లా పరిరక్షణ సమితి కన్వీనర్ సంజయ్ కుమార్ కె. తెలిపారు. ప్రజల మనోభీష్టంకు వ్యతిరేకంగా జిల్లాల విభజన మంచిది కాదని, అందరి సమిష్టి నిర్ణయంతో భౌగోళిక పరిస్థితులు, సాగునీటి పరిస్థితులు ఆధారంగా విభజన జరగాలని కోరారు. జిల్లా విభజన వల్ల నెల్లూరు ప్రాంతం పూర్తిగా నష్టపోతుందని, తిరుపతి జిల్లా వద్ద ఆర్థిక కేంద్రీకరణ జరుగుతుందని ,తద్వారా నెల్లూరు ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతారని తెలిపారు. నెల్లూరు జిల్లా విభజన వల్ల సోమశిల పరివాహక ప్రాంతాలు తీవ్ర విభేదాలు నెలకొనే పరిస్థితి ఉందని తెలిపారు. కలువాయి చేజర్ల ఆత్మకూరు , రాపూరు, పొదలకూరు మండలాలలో జలవిభేదాలు నెలకొనే ప్రమాదం ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాలను ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా తీర ప్రాంత విభజన వల్ల రాయలసీమ రాష్ట్ర నినాదాలకు ఆజ్యం పోసినట్లుగా ఉందని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విభజన వాదం నెల్లూరు ప్రజలకు నిద్రలేకుండా చేసిందని,ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోకన్వీనర్  సుధాకర్ పి , వనం శ్రీ రాములు, కళ్యాణ్ సుందర్, వీర, వనం గిరి తదితరులు పాల్గొన్నారు.
 
Tags: The division of Nellore district is meaningless

Natyam ad